Asianet News TeluguAsianet News Telugu

సన్నీ బన్నా చాహతీ హూంతో.. సానియాకు లింకు పెట్టిన వర్మ

  • మై సన్నీ లియోనీ బన్ నా చాహతీ హూం అంటూ షార్ట్ ఫిల్మ్ తీసిన వర్మ
  • సన్నీ లియోనీ మూవీకి సానియా మీర్జాకు లింకు పెట్టి సోషల్ మీడియాలో వర్మ పోస్ట్
  • సంచలన దర్శకుడి సోషల్ మీడియా సెన్సేషన్స్ ఆగవంటే ఆగవని ప్రూవ్ అయింది
ramgopal varma could not stop posting sensational comments

సంచలనాలకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ.. ‘సర్కార్‌-3’ ఘోర వైఫల్యం వల్ల వెండితెరకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు. తాజాగా ‘మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై’ అనే షార్ట్‌ ఫిల్మ్‌ను రూపొందించాడు. ఆ సినిమా గురించి సోషల్‌ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఆసలు ఆ సినిమా తాను ఎందుకు తీశానో ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చెప్పాడు వర్మ. 

 

‘నేను ఇటీవల తీసిన ‘మేరీ భేటీ సన్నీలియోన్‌ బనానా చాహ్‌తా హై’.. తనకు గతం గుర్తుచేసిందని ఓ అమ్మాయి ఇటీవల నాకు మెసేజ్‌ చేసింది. ఆ అమ్మాయి గతంలో ఎంతో మంచి టెన్నిస్‌ ప్లేయర్‌ అట. అయినప్పటికీ ఆ అమ్మాయి యుక్త వయసుకొచ్చాక ఆమె తండ్రి ఆమెను టెన్నిస్‌ అడనివ్వలేదట. దానికి కారణం ఆ ఆటలో భాగంగా పొట్టి స్కర్టులు వేసుకోవాల్సి రావడమే. ఇలాంటి భావాలతో మహిళలను అణగదొక్కే సుంకుచిత మనస్తత్వాలను గురించి చెప్పేందుకే నేను ఈ షార్ట్‌ ఫిల్మ్‌ తీశాన’ని చెప్పాడు వర్మ.

 

టెన్నిస్ ప్లేయర్ అని చెప్పాడు, కంటెంట్‌ బాగానే ఉంది, అయినప్పటికీ ఆయన షేర్‌ చేసిన సానియా ఫోటో కాస్త వివాదాస్పదంగా మారింది.

Follow Us:
Download App:
  • android
  • ios