వర్మ కామెంట్స్ వింటే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో..

వర్మ కామెంట్స్ వింటే పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాడో..

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ.. చుట్టూ జరుగుతున్న అంశాలపై.. ముఖ్యంగా జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఏదో ఒక విమర్శ చేసి వార్తల్లో నిలుస్తుంటారు. ఏమైందో ఏమో కానీ ఈసారి తన సహజశైలికి భిన్నంగా పవన్ కల్యాణ్ ను పొడగ్తలతో ముంచెత్తారు వర్మ.

 

తాజాగా పవన్ కల్యాణ్ పై వర్మ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు హాట్ టాపిక్ అయింది. ఇటీవల పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాలు తిరుగుతూ రాజకీయ ప్రసంగాలు ఇచ్చారు. పలు రాజకీయ, సామాజిక అంశాలపై స్పందించారు. తనకు పరిటాల గుండు కొట్టించాడంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారంలో ఉన్న రూమర్‌పై ఆయన క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పవన్ ప్రసంగంపై వర్మ స్పందించారు.

 

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ స్పీచ్ ఇప్పుడే చూశాను. వివిధ అంశాలపై ఆయన స్పందించిన తీరు, ఆయనకు ఉన్న దూరదృష్టిని చూసి థ్రిల్ అయ్యానని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు. తనపై ప్రచారంలో ఉన్నరూమర్ల మీద పవన్ కళ్యాణ్ స్పష్టమైన క్లారిటీ ఇచ్చారని, ఎంతో నిజాయితీగా స్పందించారని, ఈ క్రమంలో ఆయా వ్యక్తుల పేర్లను ప్రస్తావిస్తూ తన మనసులోని భావాలను, ఆలోచనలను ఏ మాత్రం సిగ్గుపడకుండా, దాచకుండా వ్యక్తం చేయడం బాగా నచ్చిందని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

 

మాట్లాడే ముందు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తాడు, ఈ విషయంలో ఆయన నుండి నేను పాఠం నేర్చుకున్నాను. ఎందుకంటే, నాకు ఒక స్టుపిడ్ అలవాటు ఉంది.. మాట్లాడేటప్పుడైనా, ట్వీట్ చేసేటప్పుడైనా ఎటువంటి ఆలోచనా చేయకుండా.. అప్రయత్నంగానే చేసేస్తాను... ఈ విషయంలో నేను పవన్ కళ్యాణ్ నుండి నేర్చుకుంటాను. ఈ సందర్భంగా ఆయనకు థాంక్స్ చెబుతున్నాను అని రామ్ గోపాల్ వర్మ తెలిపారు.

 

అన్ని అంశాలపై దూరదృష్టి ఉన్న పవన్ కళ్యాణ్ గొప్ప నాయకుల్లో ఒకే ఒక వ్యక్తిగా పవన్ కళ్యాణ్ నిలిచిపోతారని రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos