ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా ఆయన అగస్త్య మంజుతో కలిసి ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ను తెరకెక్కించారు. ఆ చిత్రం  ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపధ్యంలో రామ్ గోపాల్ వర్మ ఏదో పగ పట్టినట్లుగా తనకు ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీసే ఛాన్స్ ఇవ్వలేదని ఈ సినిమా తీస్తున్నారని మీడియాలో వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి.  

బాలకృష్ణతో ఎన్టీఆర్‌ బయోపిక్‌ చేసే  అవకాశం మీకే వచ్చుంటే, అప్పుడు  ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’లో ఉన్న కంటెంట్ ని  తెరపై చూపించకపోదురని అంటున్నారు. ఈ విషయమై మీడియా వారు డైరక్టర్ గా రామ్ గోపాల్ వర్మనే ప్రశ్నించారు. దానికి వర్మ చాలా సూటిగా సమాధానమిచ్చారు.

రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ.. 'ఎన్టీఆర్‌ బయోపిక్‌ తీస్తున్నప్పుడు   ఈ అంశం లేకపోతే... అందులో    భావోద్వేగాలు, సంఘర్షణ అంటూ ఏమీ ఉండవు. అందుకే అది ఉంటేనే సినిమా చేస్తానని బాలకృష్ణతో చెప్పా. ఆయన స్ట్రెయిట్‌ లైన్‌లో సినిమా చేస్తేనే బాగుంటుందన్నారు. అంతే తప్ప మా మధ్య గొడవేమీ లేదు' అన్నారు.

అంతేకాదు.... ఎన్టీఆర్‌ బయోపిక్‌ గురించి బాలకృష్ణ నన్ను కలిశాక అప్పుడు నా దృష్టికి వచ్చిన సంఘటనలనే తెరకెక్కించాను. ఆయన పరిచయం చేసిన కొద్దిమంది వ్యక్తులతో ఈ సమాచారం సేకరించాక, అక్కడ్నుంచి మరింత లోతుగా వెళ్లిపోయింది అన్నారు.