Asianet News TeluguAsianet News Telugu

కుట్రలో బాలయ్య భాగస్వామి..వర్మ సినిమాలో ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తారో..

  • ఎన్టీఆర్ జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నానని వర్మ ప్రకటన
  • బాలకృష్ణ హీరోగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు వెల్లడి
  • వర్మ ప్రకటనతో సినిమాపై స్పందించిన లక్ష్మీపార్వతి
ramgopal varma balayya movie on ntr goes controversial as lakshmiparvathi doubts

దివంగత ముఖ్యమంత్రి, మహానటుడు ఎన్టీఆర్ జీవితంపై సినిమా తీస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఆర్ సతీమని లక్ష్మి పార్వతి దీనిపై వెంటనే స్పందించారు.  ఓ ఛానెల్ తో మాట్లాడుతూ.. ఎన్టీఆర్ మీద సినిమా తీయాలని నేను కూడా ఎంకరేజ్ చేస్తున్నాను, కానీ వాస్తవాలు తీయాలని, నిజాలను నిర్భయంగా చెప్పాలని కోరుకుంటున్నాను అని ఆమె అన్నారు. రామ్ గోపాల్ వర్మ అంటేనే కాంట్రవర్సల్. ఆయనంటేనే ఓ వివాదం. ఎప్పుడో మరిచిపోయినటువంటి పాత పగలను గుర్తు చేయడం...అనేది ఇప్పటి వరకు వచ్చిన ఆయన సినిమాల మీద ప్రజల అభిప్రాయం. అలాంటి వ్యక్తి ఎన్టీఆర్ జీవితంలోని వివాదాలన్నింటినీ కూడా స్పష్టంగా తీయగలడా? అని ఆమె సందేహం వ్యక్తం చేశారు.

 

వర్మ సినిమాలో బాలకృష్ణ హీరో అనే మాట వినపడుతోంది. అది ఎందుకొచ్చిందో నాకూ తెలియదు. బాలకృష్ణను పెడితే పిక్చర్ కు న్యాయం జరుగదు. ఆయన తీయాలనుకున్న వివాదాస్పద అంశాల్లో బాలకృష్ణ కూడా ఒకరు... అని లక్ష్మి పార్వతి అన్నారు. ఆ కుట్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు ఆ రోజు వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలో బాలకృష్ణ కూడా ఉన్నారు, చంద్రబాబు నాయుడికి సపోర్టు చేశారు. మరి బాలకృష్ణ వర్మ సినిమాలో ఉంటే నిజాన్ని నిర్భయంగా వర్మ చూపించగలరా? అని లక్ష్మిపార్వతి ప్రశ్నించారు.

 

వివాదమైన సంఘటనలు ఉంటాయని వర్మ చెబుతున్నారు కనుక.... వైస్రాయ్ హోటల్ లో ఎన్టీఆర్ పై చెప్పులేసిన సంఘటన, అల్లుడు తనకు చేసిన అన్యాయం మీద మాట్లాడిన మాటలు, జెమినీ టీవీలో ఆయన ఇచ్చిన ధర్మపీఠం ఇంటర్వ్యూ ఇవన్నీ కూడా ప్రత్యేక సాక్ష్యాలే. ఇవన్నీ చూపాలి.

 

కానీ అవి చూపిస్తే చంద్రబాబు, బాలయ్య ఊరుకుంటారా? ఎన్టీఆర్ మీద జరిగిన కుట్రలన్నింటినీ కూడా వర్మ చెప్పగలరా? అలా చెబితే చంద్రబాబు నాయుడు ఊరుకుంటారా? అసలు ముందు బాలకృష్ణ ఊరుకుంటారా? ఇన్నీ కాకుండా వాళ్లకు అనుకూలంగా చెబితే నేను ఊరుకుంటానా? అని లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించారు.

 

ఎన్టీఆర్‌కు కుటుంబ సభ్యుల నుండి చీత్కారాలు ఎదురయ్యాయని నేనెప్పుడూ అనలేదు. ఆయన్ను ఎవరూ పట్టించుకోలేని పరిస్థితుల్లో ఆయన నన్ను వివాహం చేసుకోవాల్సి వచ్చిందని నేను రాసిన పుస్తకంలో రాశాను. ఆ మాట కూడా నాది కాదు... స్వయంగా ఎన్టీఆర్ గారు ప్రెస్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే ఈ విషయం చెప్పారు. నన్ను చూసుకోవడానికి వివాహం అవసరం అయింది. అందుకే నేను ద్వితీయ వివాహం చేసుకున్నాను. నా చేయి, కాలు సరిగా పని చేయదు. నేను అన్నం తినలేను అని స్వయంగా ఆయన చెప్పిన మాటలే ఆ పుస్తకంలో రాశాను... అని లక్ష్మి పార్వతి తెలిపారు.

 

నేషనల్ ఫ్రంట్ స్థాపించి విపి సింగ్ లాంటి వారిని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత ఎన్టీఆర్ లాంటి మహానుభావుడికే దక్కింది. కాబట్టి చరిత్రను గొప్పగా చూపిస్తే అది వేరు. కానీ చివర్లో ఆయన పదవి లాగేసినటువంటి వైనాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూపించగలిగే ధైర్యం అయితే రామ్ గోపాల్ వర్మకు ఉందో లేదో తెలియదు కానీ... బాలకృష్ణ పేరు బయటకు వస్తోంది కాబట్టి ఆయన్ను హీరోగా పెడితే ఈ సినిమాకు న్యాయం జరుగదు అని నేను అనుకుంటున్నాను... అని లక్ష్మి పార్వతి అన్నారు.

 

బాలకృష్ణ సినిమా తీస్తానని ప్రకటించినపుడు కూడా నేను ఒకటే మాట చెప్పాను. మీ నాన్న గారు సాధించిన గొప్పతనం, విజయాలు అందరికీ కూడా ఆదర్శవంతం అవుతాయని చెప్పాను. నువ్వు వివాదాల జోలికి వెళ్లావంటే నీ బావకు నీవు సపోర్టు చేయాల్సి వస్తుంది. నీ బావను సపోర్టు చేస్తే మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగదు. ఎందుకంటే మీ నాన్న చెప్పిన మాటలు పూర్వ పక్షం చేసినట్లు అవుతుంది. కనుక ఇది కరెక్ట్ కాదు...అటువంటి వివాదాల జోలికి పోకుండా నువ్వు తీసుకో సినిమా అని చెప్పాను అని లక్ష్మి పార్వతి అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios