Asianet News TeluguAsianet News Telugu

తాతయ్యకు ముద్దులన్నీ పెన్ డ్రైవ్ లో వేసివ్వండి, చిల్ అవుతాడు-వర్మ

  • అర్జున్ రెడ్డి సినిమాను భుజాలకెత్తుకున్న రామ్ గోపాల్ వర్మ
  • వారం రోజులైనా వీహెచ్ తో సోషల్ మీడియాలో వార్
  • అర్జున్ రెడ్డి ముద్దు సీన్లన్నీ బ్యాక్ టు బ్యాక్ పెన్ డ్రైవ్ లో వేసి వీహెచ్ కు ఇవ్వాలన్న వర్మ
ramgopal varma asks arjun reddy team to give kisses pen drive to vh

అర్జున్ రెడ్డి సినిమాను ప్రమోట్ చేసేందుకు కంకణం కట్టుకున్న రామ్ గోపాల్ వర్మ ఎందుకు ఈ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడో తెలియదుగానీ.. తెలంగాణ మెగా స్టార్ అని విజయ్ దేవరకొండను ఆకాశానికెత్తేసి, సందీప్ వంగా దర్శకత్వం ట్రెండ్ సెట్ చేసిందని, బూతులున్నాయంటూ పోస్టర్ చించేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ పై విసుర్లతో అర్జున్ రెడ్డి ప్రమోషన్ మరింత రక్తి కట్టిస్తున్నాడు వర్మ.

 

ఇక వీహెచ్ అభ్యంతరాలపై స్పందించిన విజయ్ దేవరకొండ నా సినిమాను పొగిడిన వాళ్లంతా నాకు ఇదవుతారు, అదవుతారు అని చెప్తూ.. వీహెచ్ తాతయ్యా జస్ట్ చిల్... మేమేదో నానా కష్టాలు పడి సినిమాలు తీస్తుంటే.. ఇలా వుంది అలావుంది అని మాపై నీలాంటివాళ్లు కాలు దువ్వటం ఏం బాగలేదు. ఎందుకలా తొడగొడుతున్నావో అర్థం కావట్లేదంటూ ట్విటర్ లో సందేశమిచ్చాడు.

 

దీనిపై రామ్ గోపాల్  వర్మ కూడా తన స్టైల్లో స్పందించాడు. తాతయ్యకు సినిమాలోని ముద్దుల సీన్ లన్నీ బ్యాక్ టు బ్యాక్ కట్ చేసి పెన్ డ్రైవ్ లో వేసిచ్చి,.., ఒంటరిగా కూర్చోని చూడమని చెప్తే తప్పక చిల్ అవుతాడంటూ సెటైర్ వేశాడు. మరి దీనిపై వీహెచ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios