రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాలను నిషితంగా గమనిస్తున్నాడు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రేవంత్ చేరికతో కాంగ్రెస్ పార్టీపై నమ్మకం మరింత పెరిగిందన్న వర్మ.. ఏకంగా రేవంత్ ను బాహుబలితో పోల్చిన సంగతి తెలిసిందే. వర్మ తాజాగా బాహుబలి గెటప్ లో మార్ఫింగ్ చేయించిన రేవంత్ రెడ్డి ఫోటోను తన ఫేస్ బుక్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి అటెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. సాహోరే బాహుబలి రేవంత్ రెడ్డి అంటున్నాడు.