ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుని.. ఎన్నో ఏళ్ళ నుంచి సంతోషంగా కాపురం చేసుకుంటున్న స్టార్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో అజిత్, షాలినీ జంట కూడా ఒకరు. అయితే వీరి ప్రేమకు సబంధించిన ఓ రహస్యాన్ని వెల్లడించాడు.. కోలీవుడ్ డైరెక్టర్ ఆయన ఏమన్నారంటే..?
కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్స్‌లో అజిత్ కుమార్ - షాలిని జంట ఒకటి. అజిత్ కు తమిళంతో పాటు.. తెలుగులో కూడా భారీగా ఫాలోయింగ్ ఉంది. ఈ స్టార్ కపుల్ లవ్ స్టోరీలో చాలా ట్విస్ట్ లు ఉన్నాయి. ప్రస్తుతం ఎంతో హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తున్న వీరి ప్రేమ సమంచంలో.. అజిత్ ను హెచ్చరించాడట ఓదర్శకుడు. ఆయన ఎవరో కాదు రమేష్ ఖన్నా. అప్పట్లో షాలినిని పెళ్లి చేసుకోవద్దని అజిత్‌ను హెచ్చరించాడట డైరెక్టర్ రమేశ్ ఖన్నా.
అజిత్ - షాలినీ ప్రేమించుకున్న టైమ్ లో అంతటా వీరి గురించే హాట్ టాపిక్ నడుస్తుండేది. ఈక్రమంలో ప్రజలందరూ మీ గురించే మాట్లాడుతున్నారు. షాలినిని పట్టించుకోవడం మానేయ్యి.. కెరీర్ పై గట్టిగా దృష్టి పెట్టు అని గట్టిగా చెప్పాడట. కానీ అప్పటికే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నారటి.. ఆసంగి గ్రహించకుండా..వీరి మీద పుకార్లు వస్తున్నాయన్న ఉద్దేశ్యంలో దర్శకుడు అలా చెప్పాడట. అయితే మరో డైరెక్టర్ హెచ్చరించే సరికి.. వీరి ప్రేమ గురించి అప్పుడు డైరెక్టర్ రమేష్ కు అర్ధం అయ్యిందట. ఆ తర్వాత 2000లో జరిగిన అజిత్, షాలినిల వివాహానికి తాను కూడా వెళ్ళానని అన్నారు దర్శకుడు రమేష్ ఖన్నా. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.
అజిత్ - షాలినీలు 1999లో అమర్కలం సినిమా షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డారు. ముందుగా వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. బలమైన పరిచయంగా.. అది కాస్త ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమలో ఉన్న వీరు 2000 ఏప్రిల్ 24న వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఇద్దరు పిల్లలు.. పెళ్లి తర్వాత షాలిని ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఫ్యామిలీ లైఫ్ ను లీడ్ చేస్తూ.. పిల్లల కెరీర్ ను చూసుకుంటుంది. ఇక అజిత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిని విషయం తెలిసిందే.
1999లో అమర్కలం సినిమాతో తొలిసారిగా వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమా చేయనని .. చదువుకోవాలని షాలినీ పట్టుపడ్డంతో.. ఆమెను ఒప్పించడానికి అజిత్ రంగంలోకి దిగాడు. అప్పుడు ఏర్పడ్డ పరిచయం.. స్నేహంగా.. ఆతరువాత ప్రేమగా మారింది. ఈక్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే అజిత్ అనుకోకుండా ఆమె మణికట్టుకు గాయం చేయడం.. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం గురించి దగ్గరుండి చూసుకోవడం.. వీరి ప్రేమ పెరగడానికి దోహదపడింది. అంతే కాదు ఈసినిమా తరువాత ఏడాది పాటు ప్రేమించుకుని 2000 లో పెళ్లి చేసుకున్నారు.
