Asianet News TeluguAsianet News Telugu

గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సదస్సులో రామ్ చరణ్ స్పీచ్

  • నవంబర్ 28 నుంచి హైదరాబాద్ లో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సదస్సు
  • గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సదస్సులో పాల్గొననున్న రామ్ చరణ్
  • సినిమా రంగం, అర్థిక వ్యవస్థ అభివృద్ధి అనే అంశంపై ప్రసంగించనున్న రామ్ చరణ్ 
ramcharan to participate in global econmic summit

హైదరాబాద్ హెచ్ ఐసీసీలో జరగనున్న గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో... వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మిట్ లో అమెరికా ప్రెసిడెంట్ కుమార్తె ఇవాంక కూడా చీఫ్ గెస్ట్ గా రానున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో నవంబర్ 29న టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సినిమా భవిష్యత్తు అనే అంశంపై ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది.

 

ఈ సెషన్ లో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ సినిమా ఆధారంగా జరిగే బిజినెస్ ను ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో... క్రియేటివ్ రంగం ద్వారా మెరుగైన ఆర్థిక ఫలాలు సాధించడం ఎలా అన్న అంశంపై ప్రసంగించనున్నారు.

 

సదస్సులో పాల్గొనే ప్రతినిథులు సినిమాపై పానెలిస్ట్ లు ఇచ్చే సూచనల ద్వారా రెవెన్యూ సాధించడం ఎలా, ఉద్యోగాలు, సంపద సృష్టి తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సెషన్ లో రామ్ చరణ్ తో పాటు అదితి రావ్ హైదరి, నైజీరియన్ నటి స్టెఫానీ లైనస్, సుభాష్ చంద్ర, ఎసెల్ గ్రూప్ చైర్మన్ పానెలిస్ట్ లుగా వ్యవహరించనున్నారు.

ఇక అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ, చరణ్ అత్తగారైన సంగీతా రెడ్డి యాన్ ఆడియెన్స్ ఆఫ్ బిలియన్స్(బిలియన్ శ్రోతలు) అనే సెషన్ లో పానెలిస్ట్ గా వ్యవహరించనున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios