అప్పుడప్పుడు మా ఆవిడ ఫోన్ చెక్ చేస్తుంట

Ramcharan soon to be part of social media
Highlights

అప్పుడప్పుడు మా ఆవిడ ఫోన్ చెక్ చేస్తుంట

ఒకప్పుడు ప్రమోషన్స్ అంటే మీడియాని మనమే పిలవాలి మన సినిమా విషేషాలు పంచుకోవాలి. ఇప్పుడు కాలం మారింది అన్నీ ఫోన్ లోనే అయిపోతున్నాయి. ఎప్పటికప్పుడు సినిమావాళ్లు ఫేస్ బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా షేర్ చేసుకుంటున్నారు. కానీ మన రామ్ చరణ్ వ్యక్తిగత విషయాల్ని మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడడు . అప్పుడప్పుడు ఆయనకు సంబంధించిన పర్సనల్ విషయాలు బయటకు వస్తూనే ఉంటాయి.రామ్ చరణ్ కి సంబంధించి చాలా విషయాలు ఆయన భార్య తన ఇన్స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తు ఉంటుంది.ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ..అప్పుడప్పుడు తన భార్య ఉపాసన మొబైల్ చెక్ చేస్తుంటాడట. ఈ విషయాన్ని అతడే బయటపెట్టాడు. 

సోషల్ మీడియాలో అభిమానుల కామెంట్స్, వాళ్ల ఫీలింగ్స్ తెలుసుకుంటాను. ఎలా అంటే, అప్పుడప్పుడు మా ఆవిడ ఫోన్ చెక్ చేస్తుంటా. ఆమె ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ ను నేను ఓపెన్ చేస్తాను. ఆమె పెట్టిన పోస్టులు అలా అలా చూస్తుంటాను. నాకు సంబంధించిన కామెంట్స్ ఏమైనా ఉంటే చదువుతాను. అలా సోషల్ మీడియాలో నా ఫ్యాన్స్ ఫీలింగ్స్ నేను తెలుసుకుంటాను. నేను సోషల్ మీడియాలో లేను. కానీ రావాలని ఉంది. సోషల్ మీడియాలోకి వచ్చేందుకు ఓ మంచిరోజు కోసం చూస్తున్నాను. మా ఆవిడ నన్ను రమ్మని ఫోర్స్ చేస్తోంది. తను ఇన్ స్టాగ్రామ్ లో ఉంది. మంచి డేట్ చూసి త్వరలోనే నేను మళ్లీ వస్తా.

 

loader