ప్రస్తుతం రామ్  చరణ్ .. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో వుండనుందనేది ఆసక్తికరంగా మారింది. చరణ్ నెక్స్ట్ మూవీ దర్శకుడిగా వంశీ పైడిపల్లి పేరు తాజాగా తెరపైకి వచ్చింది. రీసెంట్ గా చరణ్ ను కలిసి వంశీ పైడిపల్లి ఒక లైన్ చెప్పాడట. లైన్ చాలా బాగుందనీ .. పూర్తి కథను సిద్ధం చేసి వినిపించమని చరణ్ చెప్పినట్టుగా వార్తలు గుప్పు మన్నాయి. 

అయితే ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...వంశీ పైడిపల్లి చెప్పిన లైన్ విన్నా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. సురేంద్రరెడ్డి, కొరటాల శివ, క్రిష్ ల కథలు కూడా విన్నానని వీటిలో ఏది ముందుకు తీసుకెళ్లాలనే విషయమై ఇంకా ఓ క్లారీటీకి తాను రాలేదని చెప్పినట్లు సమాచారం. అయితే లైన్ బాగుందని, స్క్రిప్టు డెవలప్ చేయమని చెప్పారట. 

దాంతో వంశీ పైడపల్లి ఇలాంటి సమాధానం ఎక్సెపెక్ట్ చేయకపోవటంతో షాక్ అయ్యారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ఎవడు అనే సినిమా వచ్చి సూపర్ హిట్టైన సంగతి తెలిసిందే. దాంతో వెంటనే ఓకే చేసేస్తాడని అనుకున్న వంశీకు నిరాశే ఎదురైంది. అయితే స్క్రిప్టు పూర్తిగా డెవలప్ చేయమన్నారు కాబట్టి చేస్తారనే ఆశ కూడా ఉందట. 

ఇక భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోన్న  ఆర్ .ఆర్ ఆర్ సినిమాను, 2020 జూలై 30వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఆ తరువాతనే చరణ్ తన తదుపరి సినిమాను మొదలుపెట్టనున్నాడు.  'మహర్షి' మే 9వ తేదీన విడుదలకానుంది.