'రంగస్థలం' సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేసుకుని .. పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. చరణ్ .. సమంత డిఫరెంట్ లుక్స్ తో కనిపించనుండటంతో, అభిమానులంతా ఈ సినిమా .. థియేటర్స్ కి వచ్చే రోజు కోసం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను ఈ నెల 30వ తేదీన విడుదల చేయనున్నారు.ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుంచి 'ఎంత సక్కగున్నావే' .. 'రంగ రంగ రంగస్థలాన' అనే పాటలు బాగా పాప్యులర్ అయ్యాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా నుంచి రేపు సాయంత్రం 6 గంటలకు మరో సింగిల్ ను వదలనున్నారు. 'రంగమ్మ .. మంగమ్మ' అంటూ ఈ సాంగ్ కొనసాగనుంది. చూస్తుంటే ఇది జానపద బాణీలో కొనసాగేలా అనిపిస్తోంది. ఈ సాంగ్ ఏ స్థాయిలో జనంలోకి దూసుకెళుతుందో .. ఎంతటి సందడి చేస్తుందో చూడాలి.