రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985 సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై చిత్రీకరిస్తున్న సంగతి తెలెసిందే. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న సంగతి తెలిసిందే. పల్లెటూరి ప్రేమకథ నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఫుల్ గడ్డంతో వెరైటీ లుక్ లో కనిపిస్తాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కాంబినేషన్ పై ఉన్న నమ్మకం సినిమా బిజినెస్ రూపంలో తెలుస్తుంది. అంతేకాదు సినిమాలో పూజా హెగ్దె ఐటం సాంగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది.

 

సుకుమార్ తన రొటీన్ పంథాకు భిన్నంగా పల్లెటూరు వాతావరణంలో సినిమా తెరకెక్కించడం క్యూరియాసిటీ పెంచుతోంది. అందుకే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ కాకుండానే ప్రీ రిలీజ్ బిజినెస్ హంగామా మొదలు పెట్టింది. ఇప్పటికే నైజా ఏరియాలో రంగస్థలం భారీ రేటుకి అడుగుతుండగా మిగతా ఏరియాల నుండి కూడా సర్ ప్రైజింగ్ బిజినెస్ ఆఫర్ చేస్తున్నారట. చూస్తుంటే చరణ్ రంగస్థలం 100 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని అంటున్నారు. ఇక రీమేక్, శాటిలైట్ రైట్స్ కూడా బోనస్ గా రానున్నాయి.