రంగస్థలం ఫస్ట్ లుక్... ఊర మాస్ గా రామ్ చరణ్

ramcharan rangasthalam first look
Highlights

  • రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలం 1985
  • మాసిన గెడ్డంతో పక్కా విలేజీ కుర్రాడిలా రామ్ చరణ్ లుక్స్
  • ఫస్ట్ లుక్ తోపాటు మార్చి 30న సినిమా రిలీజ్ అని కూడా ప్రకటించిన యూనిట్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ రంగస్థలం 1985. ఈ మూవీ ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఇవాళ ''రంగస్థలం 1985'' ఫస్ట్ లుక్ ఎట్టకేలకు రానే వచ్చింది. ముందుగా చెప్పిన టైమ్ మార్చేసి డిసెంబర్ 9న.. ఉదయం 9 గంటలకు అని చెప్పారు. అన్నట్లుగానే ఫస్ట్ లుక్ వచ్చేసింది.

 

ఈ పోస్టర్ చూస్తుంటే ఒక్క విషయం సింపుల్ గా అర్ధమైపోతోంది. మనం ఒక ఊర మాస్ సినిమా చూడబోతున్నాం. చిట్టిబాబు పాత్రలో హీరో రామ్ చరణ్ తన మాస్ లుక్కును చూపిస్తున్నాడు. మాసిన గెడ్డంతో.. ఎత్తి కట్టిన లుంగీలో.. మెడలో టవల్ వేసుకుని.. పక్కా విలేజీ కుర్రాడిలా ఉన్నాడంతే. అది కూడాను స్టోరి 1985లో జరిగే కథ కాబట్టి.. దానికి తగ్గట్లే మనోడి గెటప్ కూడా ఉంది. మొత్తానికి చాలా గ్యాప్ తరువాత సినిమాతో వస్తున్న సుకుమార్.. ఇలా ఫస్ట్ లుక్ తో బాగానే ఇంప్రెస్ చేశాడు. 
 

అయితే అధికారికంగా ఈ లుక్ ద్వారా.. మార్చి 30న సినిమా రిలీజ్ అని కూడా ప్రకటించేశారు. వాస్తవానికి సంక్రాంతినాడు రావాల్సిన రంగస్థలం.. హీరోయిన్ సమంత కారణంగా షూటింగ్ ఆలస్యం కావడంతో.. ఆ డేట్ మిస్సయ్యింది. అలాగే అజ్ఞాతవాసి రిలీజ్ కూడా అప్పుడే ఉండటంతో.. మనోళ్ళు రంగస్థలం సినిమాను వాయిదా వేసి.. మార్చిలో దించుతున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

 

loader