‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తర్వాత పాన్‌ ఇండియా స్థాయి సినిమాలే చేయాలనేది ఆయన ప్లాన్ గా తెలిసింది. అందుకు తగ్గ కథలపైనే ఆయన దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో అందులో నటించిన స్టార్స్ అందరికీ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడం ఖాయం. అందుకే ఆ తర్వాత చేసే సినిమాలు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి తగ్గట్టుగా ఉండాలనేది రామ్‌చరణ్‌ ఆలోచనగా చెప్తున్నారు. 

అప్పట్లో జయం రవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వం వహించిన తని ఒరువన్ తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సినిమాని రామ్ చరణ్ హీరోగా తెలుగులో ధృవ టైటిల్ తో రీమేక్ చేసారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.వాస్తవానికి ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాలని భావించారు. చరణ్ కి ఆ విషయాన్ని మోహన్ రాజా ముందే చెప్పారు. అయితే చరణ్ మాత్రం సురేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపించాడు. అక్కడితో ఆ కథ ముగిసింది. అయితే మళ్లీ ఇంతకాలానికి మోహన్ రాజా ..మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ఆయన త్వరలో రామ్ చరణ్ తో సినిమా చేసే అవకాసం ఉందని తెలిస్తోంది. 

వివరాల్లోకి వెళితే...మిగతా హీరోలంతా .. రాబోయే రెండు మూడేళ్లకి సరిపడా కథల్నిఓకే చేసేసి లైన లో పెట్టుకుంటున్నారు. కరోనాతో వచ్చిన బ్రేక్ లో కథల్ని వినడమే పనిగా పెట్టుకుని, వరుసగా సినిమాల్ని ప్రకటించేశారు. అయితే చెర్రీ మాత్రం అందుకు భిన్నంగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆయన సెట్స్‌పై ఉన్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’, ‘ఆచార్య’ మినహా ఇప్పటిదాకా కొత్త సినిమాల్ని ప్రకటించలేదు. అనేక మంది స్టార్ డైరక్టర్స్ చెప్పిన కథలు విన్నారు కానీ, ఇంకా ఏదీ ఖరారు చేయలేదు. రామ్‌చరణ్‌ ప్రస్తుతం సరికొత్త ప్లానింగ్ తో ముందుకు వెళ్లాలనుకుంటున్నట్లు సమాచారం. 

‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ తర్వాత పాన్‌ ఇండియా స్థాయి సినిమాలే చేయాలనేది ఆయన ప్లాన్ గా తెలిసింది. అందుకు తగ్గ కథలపైనే ఆయన దృష్టి పెట్టినట్టు సమాచారం. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’తో అందులో నటించిన స్టార్స్ అందరికీ పాన్‌ ఇండియా స్థాయిలో గుర్తింపు రావడం ఖాయం. అందుకే ఆ తర్వాత చేసే సినిమాలు ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’కి తగ్గట్టుగా ఉండాలనేది రామ్‌చరణ్‌ ఆలోచనగా చెప్తున్నారు. 

ఈ క్రమంలో... తమిళంలో స్టార్ డైరక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న మోహన్‌రాజా రామ్‌చరణ్‌తో కథా చర్చలు జరుపుతున్నట్టు తెలిసింది. మోహన్‌రాజా చెప్పిన కథ రామ్ చరణ్‌కీ నచ్చిందని, ఈ కాంబినేషన్ లో పాన్‌ ఇండియా స్థాయి సినిమా రూపొందే అవకాశాలున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెబుతున్నాయి.