మరో మెగీ హీరోతో రొమాన్స్ చేయనున్న అనసూయ ఇప్పటికే సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ తాజాగా రామ్ చరణ్ రంగస్థలం 1985లో అనసూయ
బుల్లితెరపై తన సత్తా చాటి వెండి తెరపైనా తానేంటో నిరూపించుకుంది అనసూయ. ఇప్పుడు ఈ బుల్లి తెర లేడీ స్టార్ అనసూయకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీలో నటించే అవకాశం దక్కింది. చెర్రీ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ నటిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ స్వయంగా అనసూయే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అందులో రంగస్థలం షూటింగ్‌కి వస్తున్న నటీనటులకు స్వాగతం అంటూ రాసింది.
దీన్ని బట్టి రామ్ చరణ్ నటిస్తున్న రంగస్థలం 1985లో అనసూయ కూడా నటిస్తోందని అర్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిసరాల్లో జరుగనున్నట్లు సమాచారం. కాగా అనసూయ ‘సోగ్గాడే చిన్నినాయనా’.., ‘క్షణం’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
