కామెడీ కింగ్‌ సప్తగిరి కథానాయకుడిగా 'సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌' వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై లిమిటెడ్‌ అధినేత డా.రవికిరణ్‌ మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 7న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌కి రెడీ అవుతోంది.

 

విజయ్‌ బుల్గానిన్‌ సంగీత సారధ్యంలో ఈ చిత్రం ఆడియో రూపొందింది. మొదటి పాటను సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ విడుదల చేయగా, రెండో పాటను సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌తేజ్‌ రిలీజ్‌ చేశారు. ఈ రెండు పాటలకు అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోందని నిర్మాత డా.రవికిరణ్‌ తెలిపారు. కాగా, ఈ చిత్రం థియేట్రికల్‌ ట్రైలర్‌ను ఆదివారం మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ విడుదల చేయనున్నారు. 

 

డిసెంబర్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో కామెడీ కింగ్‌ సప్తగిరి సరసన కశిష్‌ వోరా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్‌రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్‌ లక్కాకుల.