మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రంగా తెరకెక్కుతున్న 'సై.. రా నరసింహారెడ్డి' చిత్రం డిసెంబర్ 6 నుంచి పట్టాలెక్కనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అవి పూర్తయిన వెంటనే సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. అయితే చాలా కాలంగా ఈ సినిమాలో చిరుతో పాటు రామ్‌చరణ్ కూడా కనిపిస్తాడనే మాటలు వినిపిస్తున్నాయి. రామ్‌చరణ్ పాత్ర సైరాలో తప్పక వుంటుందని తెలుస్తోంది.చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో కనిపిస్తుండగా.. రామ్ చరణ్ ఒక రాజు పాత్రలో కనిపిస్తాడని సమాచారం. స్వాతంత్రం కోసం పోరాడే నరసింహారెడ్డికి  రామ్ చరణ్ పాత్ర అండదంగా ఉంటుందని సమాచారం. రామ్‌చరణ్ కనిపించబోయే రాజు పాత్ర కోసం ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్‌ను డిజైన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది. చెర్రీ లుక్ కూడా సైరాలో కొత్తగా ఉంటుందని చెబుతున్నారు.
 

చిరు నటించిన 150వ సినిమాలో కూడా చరణ్ ఓ పాటలో కనిపించాడు. ఈసారి ఏకంగా కీలక పాత్రను దక్కించుకున్నాడు. ఈ సినిమాను రామ్ చరణ్ దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహ్మాన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.