మెగాస్టార్ మూవీలో రామ్ చరణ్ ఖైదీ నెంబర్ 150లో చిరుతో కలిసి స్టెప్పులేయనున్న చరణ్ మెగా స్టార్ 150వ సినిమాలో చేయాలన్న కోరిక తీర్చుకుంటున్న చెర్రీ
గతంలో మగధీర సాంగ్ లో చరణ్ కోసం మెగాస్టార్ స్టెప్పులేశారు. ఇప్పుడు మెగా స్టార్ కోసం మెగా తనయుడు రామ్ చరణ్ స్టెప్పులేస్తాడని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం ఖైదీ నెం 150. డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. సంక్రాంతి కానుకగా భారీ స్ధాయిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రామ్ చరణ్ ఓ సాంగ్ లో చిరుతో కలిసి డ్యాన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది.
చరణ్ గతంలో ఇదే విషయం గురించి మాట్లాడుతూ... నాన్న 150వ చిత్రంలో చిన్న రోల్ అయినా సరే చేయాలని ఉంది అని చెప్పారు. అయితే...ఇప్పటి వరకు ఖైదీ నెం 150లో చరణ్ నటిస్తున్నాడా..? లేదా..? అనేది సస్పెన్స్ గానే ఉంది. కానీ.. ఖైదీ నెం 150 లో చరణ్ కనిపించడం పక్కా అని తెలుస్తుంది. చరణ్ ఈ మూవీలో చిరుతో కలిసి స్టెప్స్ వేయనున్నాడా..? లేక మూవీ ప్రమోషన్ కోసం చేసే సాంగ్ లో కనిపిస్తాడా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
