- Home
- Entertainment
- Nivetha Pethuraj పెళ్లి ఆగిపోయిందా? ఫోటోలు డిలీట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్
Nivetha Pethuraj పెళ్లి ఆగిపోయిందా? ఫోటోలు డిలీట్ చేసిన స్టార్ హీరోయిన్.. ఇదేం ట్విస్ట్
Nivetha Pethuraj: హీరోయిన్ నివేదా పేతురాజ్, రజిత్ పెళ్లి ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసిన నిశ్చితార్థం ఫోటోలను తొలగించడంతో, పెళ్లి ఆగిపోయిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్ చేసిన నివేదా పేతురాజ్
నటి నివేదా పేతురాజ్, దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త రజిత్ ఇబ్రాన్‌తో ఎంగేజ్‌మెంట్‌ని ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించారు. అక్టోబర్‌లో నిశ్చితార్థం జరగ్గా, జనవరి 2026లో పెళ్లికి ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఎంగేజ్‌మెంట్ ఫోటోలను తొలగించింది నివేదా పేతురాజ్. దీంతో అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎవరికి వారు ఇష్టం వచ్చినట్టుగా రియాక్ట్ అవుతున్నారు.
యంగ్ హీరోతో నివేదా పేతురాజ్ ఎంగేజ్‌మెంట్
నివేదా తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా రాణించింది. తెలుగులోనూ హీరోయిన్‌గా చాలా సినిమాలు చేసింది. మంచి విజయాలు కూడా అందుకుంది. ఈ క్రమంలో ఓ యంగ్ హీరోతో డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. ఆ తర్వాత బ్రేకప్ అయ్యిందని చర్చ నడిచింది. కొన్నాళ్లు సినిమాలకు కూడా దూరంగా ఉన్న నివేదా పేతురాజ్ ఇటీవలే పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని చెప్పి ఆశ్చర్యపరిచింది.
ఒంటరిగా నివేదా పేతురాజ్
ఒంటరితనం గురించి తరచూ స్టేటస్‌లు పెడుతున్న నివేదా, తన నిశ్చితార్థంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియని టైంలో, తన ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిశ్చితార్థం ఫోటోలను, ప్రియుడి ఫోటోను తొలగించింది.
ప్రేమికులే విడిపోతున్నారు
ఈ రోజుల్లో ప్రేమించి విడిపోవడం సాధారణమైంది. ప్రేమించిన వారే విడాకులు తీసుకుంటున్న ఈ కాలంలో, సరైన వివాహ జీవితాన్ని ఎంచుకోవడం కష్టంగా మారింది. చాలా మంది హీరోయిన్లు విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటున్నారు. నిశ్చితార్థం ఆగిపోవడం మంచిదే అని అభిమానులు అనుకుంటున్నారు.
నివేదా పేతురాజ్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా?
సమంత, చైతన్య సినిమాల ద్వారా పరిచయమై, ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. నాలుగేళ్ల తర్వాత విడిపోయారు. ఇప్పుడు అటు చైతూ, ఇటు సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు నివేదా పేతురాజ్ పెళ్లి క్యాన్సిల్ అయ్యిందా? ఈ ఇద్దరు విడిపోతున్నారా అనేది అనుమానాలకు తావిస్తోంది.
నివేదా పేతురాజ్ స్పందిస్తేనే క్లారిటీ
చూడబోతుంటే నివేదా ఇప్పుడు నిశ్చితార్థాన్ని మాత్రమే రద్దు చేసుకుంది. ఆమె జీవితం ఆమె చేతుల్లోనే ఉందని అభిమానులు అంటున్నారు. ఇంతకుముందు, భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన కూడా తన పెళ్లిని రద్దు చేసుకుంది. అలానే నివేదా విషయంలో జరిగిందా అనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా ? నిజంగానే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారా? అనేది తెలియాల్సి ఉంది. ఎవరో ఒకరు స్పందిస్తేనే క్లారిటీ వస్తుంది.

