ఫేక్ కలెక్షన్స్ పై చరణ్ ఫైర్!

Ramcharan fires on fake collections
Highlights

ఫేక్ కలెక్షన్స్ పై చరణ్ ఫైర్!

ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమా విడుదలైన తరువాత హిట్ టాక్ వస్తే చాలు.. వారం రోజుల్లోనే వంద కోట్ల పోస్టర్ వేయడం కామన్ అయిపోయింది. సినిమా వారానికి మించి ఆడిందంటే ఇక రెండు వందల కోట్ల పోస్టర్ వేసినా.. ఆశ్చర్యపోనక్కర్లేదు. నిజమైన కలెక్షన్స్ ఎంత అనే విషయాన్ని గోప్యంగా ఉంచుతూ తమకు నచ్చిన నంబర్ ను పోస్టర్ మీద వేస్తున్నారు నిర్మాతలు. ఇదే విషయం స్టార్ హీరో రామ్ చరణ్ కు ఆగ్రహాన్ని తెప్పించిందని సమాచారం. చరణ్ నటించిన 'రంగస్థలం' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు రాబట్టింది ఈ చిత్రం. ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే మహేష్ బాబు నటించిన 'భరత్ అనే నేను' సినిమా విడుదలైంది. అయితే మహేష్ తో తదుపరి సినిమా చేయనున్న 'రంగస్థలం' చిత్ర నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు 'రంగస్థలం' సినిమా ప్రమోషన్స్ ను పక్కన పెట్టేశారు.

దీంతో 'భరత్ అనే నేను' సినిమా నిర్మాత దానయ్య తన సినిమాను రకరకాలుగా ప్రమోట్ చేస్తున్నారు. అందులో తప్పేం లేదు కానీ ఈ సినిమాకు ఫేక్ కలెక్షన్స్ ను చూపించడం చరణ్ కు నచ్చలేదట. రెండు వందల కోట్ల కలెక్షన్స్ దాటేసిందని ప్రకటించాలనుకున్న నిర్మాతకు చరణ్ ఫోన్ చేసి తన సినిమా మీద పోటీగా ఫేక్ కలెక్షన్స్ ప్రచారం చేయడం సరికాదని, నిజంగానే అంత వసూలు చేస్తే పోస్టర్ మీద దర్జాగా వేసుకోవచ్చని కానీ ఇలా అభిమానులను బాధ పెట్టే పనులు చేయొద్దని చెప్పినట్లు సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం చరణ్ నటిస్తోన్న బోయపాటి సినిమాకు నిర్మాత దానయ్యే కావడంతో ఆయన మీద అలిగిన చరణ్ రెండు రోజుల పాటు షూటింగ్ కు కూడా హాజరు కాలేదని సమాచారం. మరి చరణ్ అలకను ఈ నిర్మాత ఎలా తీరుస్తాడో చూడాలి!

loader