మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన గీతాఆర్ట్స్ బ్యాన‌ర్ లో, స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియ‌స్ మూవీ `ధృవ` ఈ స్టైలిష్ క‌మ‌ర్షియ‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఏస్ ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్‌, మ‌రో నిర్మాత ఎన్‌.వి.ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బ‌డ్జెట్‌, టెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. ఇప్పుడు హీరో ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ షూటింగ్ హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో జ‌రుగుతుంది. సినిమా చిత్రీక‌ర‌ణ‌తో పాటు స‌మాంత‌రంగా సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.
మెగాపవర్ స్టార్ రామ్చరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపించనున్నారు. సినిమా ఫస్ట్ లుక్ నుండి ఆడియెన్స్లో క్రేజ్ నెలకొంది. ఈ సినిమాకు హిప్ హాప్ ఆది సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాటలను ఆదిత్య మ్యూజిక్ ద్వారా నవంబర్ 9న నేరుగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. అలాగే సినిమా విడుదలకు ముందు అభిమానులు, ప్రేక్షకుల నడుమ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ను నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ మొదటి వారం లో సినిమా విడుదల అవుతుంది.
రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్, అరవింద్ స్వామి, నాజర్, పోసాని కృష్ణ మురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్- పి.యస్.వినోద్, మ్యూజిక్ - హిప్ హాప్ ఆది, ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్, ఆర్ట్ - నాగేంద్ర, ఎడిటర్ - నవీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వి.వై. ప్రవీణ్ కుమార్, ప్రొడ్యూసర్స్ - అల్లు అరవింద్, ఎన్.వి.ప్రసాద్, దర్శకుడు - సురేందర్ రెడ్డి.
