సమంత ఇలా చేయడం కొందరికైతే నచ్చట్లేదు...చెర్రీ మాత్రం ఉపాసన భయంతో చేసినట్టుంది

First Published 31, Mar 2018, 5:53 PM IST
RamCharan And Samantha Liplock In Rangasthalam
Highlights
సమంత ఇలా చేయడం కొందరికైతే నచ్చట్లేదు...చెర్రీ మాత్రం ఉపాసన భయంతో చేసినట్టుంది

 

ఇప్పుడు సోషల్ మీడియాలో రంగస్థలం హవా నడుస్తోంది. ఎవ్వరు చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అంత బాగా జనాలకి ఎక్కేసిందీ సినిమా. ట్విట్టర్ ట్వీట్లు - ఇన్ స్టాగ్రామ్ ఫోటోలు - ఫేస్ బుక్ పోస్టులు ఎక్కడ చూసినా చెర్రీ యాక్టింగ్ గురించి - సుక్కూ టేకింగ్ గురించే చర్చ జరుగుతోంది. ఈ  సినిమాలో చిట్టిబాబు - రామలక్ష్మీల మధ్య జరిగిన రొమాంటిక్ ట్రాక్ కూడా జనాలను బాగా ఆకట్టుకుంటోంది. 

ముఖ్యంగా చిట్టిబాబు అంటే రామలక్ష్మీకి ఎంత ఇష్టమో... రామలక్ష్మీ మీద చిట్టిబాబుకి ఎంత ప్రేముందో తెలియజేసేందుకు ప్రపోజింగ్ సీన్ పెట్టాడు దర్శకుడు. సినిమాలో వన్ ఆఫ్ ది హైలెట్ సీన్ ఇదే. ఈ సన్నివేశంలో మొదట రామ్ చరణ్ పెదాల మీద ముద్దు పెడుతుంది సమంతా. తర్వాత చెర్రీ కూడా ముద్దును తిరిగిచ్చేస్తాడు. ఈ సీన్ ని సమంత  ఏ మాత్రం సంకోచించకుండా చేసేసింది. కానీ చెర్రీ మాత్రం కాస్త సిగ్గుపడి... చేతులను అడ్డుపెట్టుకున్నాడు. దీంతో కొందరు నెటిజన్లు సమంత పక్కా ప్రోఫెషనల్ గా ఆలోచించి... ఏ మాత్రం ఆలోచించకుండా ముద్దు పెడితే...చెర్రీ మాత్రం ఉపాసన ఫీల్ అవుతుందోనని భయంతో చేసినట్టుంది అన్నట్టు కొంటెగా కామెంట్లు పెడుతున్నారు. 

కొందరికైతే సమంత ఇలా చేయడం నచ్చట్లేదు. ఎందుకంటే సమంతా ఇప్పుడు మామూలు నటి కాదు. అక్కినేని వారి కోడలు కూడా. నాగచైతన్య ప్రేమించి - పెళ్లి చేసుకున్న తర్వాత మరో హీరోకి ఇలా లిప్ టు లిప్ ముద్దు పెట్టడం ఏమిటని?  కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అయితే వారంతా పెళ్లయిన రామ్ చరణ్ గురించి మాట్లాడకపోవడం విశేషం.
 

 

loader