Asianet News TeluguAsianet News Telugu

అత్యంత కాస్ట్లీ మూవీ 500 కోట్ల రామాయణం రెడీ

  • రామాయణ గాధను భారీ చిత్రంగా రూపొందించే ప్రతిపాదన గతేడాది వచ్చిన సంగతి తెలిసిందే
  • ఇప్పుడీ అల్లు వారి రామాయణానికి రంగం సిద్ధమవుతోంది. 
Ramayana Movie Makers Signs MOU 500 Crores With UP Govt

రామాయణ గాధను భారీ చిత్రంగా రూపొందించే ప్రతిపాదన గతేడాది వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో రూపొందనున్న ఈ రామాయణానికి.. అల్లు అరవింద్ కూడా ఒక నిర్మాత. ఇప్పుడీ అల్లు వారి రామాయణానికి రంగం సిద్ధమవుతోంది. 

కొన్ని నెలల పాటు ఎక్కడా మాట వినిపించకపోయే సరికి.. ఈ ప్రాజెక్టును పట్టించుకోవడం లేదనే అనుమానాలు వినిపించిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడీ చిత్రానికి సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ తెలిస్తే.. ప్రొడ్యూసర్స్ ఎంత చురుగ్గా ఉన్నారో.. ఈ ప్రాజెక్టుపై ఎంత సీరియస్ గా ఉన్నారో తెలుస్తోంది. ప్రస్తుతం లక్నో సిటీలో యూపీ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడే ఈ మూవీ ప్రాజెక్టుకు సంబంధించిన ఒప్పందం కూడా జరగడం విశేషం. ఉత్తరప్రదేశ్ లో రామాయణంను తెరకెక్కించేందుకు.. యూపీ ప్రభుత్వంతో నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఓ నిర్మాత మధు మంతెన వెల్లడించారు. 

అయోధ్య నెలవైన ఉత్తర ప్రదేశ్ లోనే రామాయణం అధిక భాగం షూటింగ్ జరుపుకోనుండడంతో.. అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు నిర్మాతలు. 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో దేశంలోనే.. అత్యంత కాస్ట్లీ మూవీగా ఈ సినిమా రూపొందనుంది. మూడు భాగాలుగా రామాయణం రూపొందనుండగా.. మూడు భాషల్లో ఏకకాలంలో ఈ 3డీ రామాయణం విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి క్యాస్టింగ్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios