Asianet News TeluguAsianet News Telugu

Padamati Sandhyaragam: ప్రశాంత్ మీద రివెంజ్ తీర్చుకున్న రామలక్ష్మి.. శీను కోసం షాపింగ్ చేస్తున్న ఆధ్య?

Padamati Sandhyaragam: జీ తెలుగులో ప్రసారమవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్ మంచి కంటెంట్ తో మంచి టిఆర్పి రేటింగ్ ని సంపాదించుకుంటుంది. తనకి ఇష్టం లేకపోయినా తండ్రి కోసం పెళ్లికి ఒప్పుకున్న నేటి తరం అమ్మాయి కథ ఈ సీరియల్. ఇక ఈరోజు జూన్ 8 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం.
 

Ramalakshmi takes revenge on prashanth in todays padamati sandhyaragam serial gnr
Author
First Published Jun 8, 2023, 3:38 PM IST

 ఎపిసోడ్ ప్రారంభంలో ఎందుకు వచ్చావు అంటూ ప్రశాంత్ మీద కోప్పడుతుంది రామలక్ష్మి. అలా అడుగుతున్నావేంటి, అయినా ఆరోజు కాబోయే భర్తని అని కూడా చూడకుండా అలా వచ్చేసావేంటి  అంటూ అమాయకంగా అడుగుతాడు ప్రశాంత్. ఆరోజు నేను ఇబ్బందులు పడ్డాను తెలుసా.. అక్కడ ఉండడం సేఫ్టీ కాదని వచ్చేస్తుంటే రౌడీలు వెంటపడ్డారు ఎవరో కాపాడారు కాబట్టి సరిపోయింది.

నేను రావటం ఆలస్యం అయ్యేసరికి ఇంట్లో వాళ్ళు ఎంత కంగారు పడ్డారో తెలుసా అంటూ గట్టిగా మాట్లాడుతుంది రామలక్ష్మి. ఇంత జరిగినా కూడా ఇంట్లో నా గురించి నువ్వు చెప్పలేదు చూసావా అదే ప్రేమంటే అంటూ ఆమె చేతిలో గట్టిగా పట్టుకుంటాడు ప్రశాంత్. వదులు అంటూ అతను చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది రామలక్ష్మి.ఆ హడావుడికి జానకమ్మ వాళ్ళందరూ బయటకు వచ్చేస్తారు.

ఏం జరిగింది అని అడుగుతుంది జానకమ్మ. ఏం లేదు నాతో పాటు కాఫీ షాప్ కి రమ్మంటే  రావటం లేదు అంటాడు ప్రశాంత్. మా పర్మిషన్ లేకుండా తను ఎలా వస్తుంది అంటాడు శీను. మా ఇంట్లో పెళ్ళికి ముందే ఇలాంటివి ఒప్పుకోరు అంటుంది జానకమ్మ. అదేంటి వదిన అలా అంటావు శీను, చారు పెళ్లికి ముందే సినిమాలు కి వెళ్లారు కదా వాళ్లకి మాత్రం ఎందుకు అభ్యంతరం ఉంటుంది.

నువ్వు అలా అడ్డు చెప్తే పాపం ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు బాధపడతారు అంటుంది పద్మ. దాంతో ఏమీ మాట్లాడలేక పోతుంది జానకమ్మ. మా వదిన మౌనంగా ఉంది అంటే అంగీకరించినట్లే రామలక్ష్మి తీసుకొని వెళ్ళు కానీ త్వరగా వెళ్లి త్వరగా వచ్చేయ్ అంటుంది జానకమ్మ. సరే అంటూ బలవంతంగా రామలక్ష్మి అక్కడి నుంచి తీసుకువెళ్తాడు ప్రశాంత్.

నీవల్లే కోచ్ సార్ దెబ్బలు తిన్నారు నీవల్లే నేను హాకీ కి దూరమయ్యాను నీకు తగిన గుణపాఠం చెప్పాలి అనుకుంటుంది రామలక్ష్మి. ఆ తర్వాత అందరూ షాపింగ్ కి వెళ్తారు. ఖరీదైన చీరలు చూపించమంటుంది పద్మ. అంత ఖరీదైన బట్టలు మనం కొనలేము అంటుంది పార్వతి. ఎందుకు కొనలేము మా అన్నయ్య డబ్బులే కదా అంటూ జానకి వైపు వెటకారంగా చూస్తుంది పద్మ.

ఎంతైనా పర్వాలేదు తీసుకోమంటుంది జానకమ్మ. నువ్వే ఇంత ఖరీదు పెట్టి తీసుకుంటుంటే మా అక్క ఇంకెంత ఖరీదైయిన బట్టలు తీసుకుంటుందో అంటుంది పార్వతి. పక్కనే బట్టలు సెలెక్ట్ చేస్తున్న చారు వాళ్ళమ్మ తనకోసం ఖరీదైన బట్టలు తీసుకొని పద్మ వాళ్లకి చౌక రకం బట్టలు తీసుకుంటుంది. అది చూసి నవ్వుకుంటారు జానకమ్మ, ఆధ్య.

 ఎంతసేపని ఈ ఆడవాళ్ళ దగ్గర దిష్టిబొమ్మల్లాగా నిల్చుంటాము వీళ్లు ఇప్పుడప్పుడే షాపింగ్ కంప్లీట్ చేసేలాగా లేరు కదా ఈలోపు మనం వెళ్లి బట్టలు సెలెక్ట్ చేసుకుందాం అని బిట్టుతోని శీను తోని చెప్తాడు వెంకటరావు. సరే అంటాడు బిట్టు. శీను మాత్రం ముభావంగా ఉంటాడు బలవంతంగా అతనిని తనతోపాటు తీసుకువెళ్తాడు వెంకటరావు. మరోవైపు రెస్టారెంట్ కి వెళ్లిన ప్రశాంత్ నీకు ఏం కావాలి అని రామలక్ష్మి అడుగుతాడు.

వేడి వేడి సాంబార్ ఇడ్లీ కావాలి అంటుంది  రామలక్ష్మి. అయితే నువ్వు నన్ను క్షమించినట్లే కదా అయినా ఎందుకు నువ్వు అంత రిసీవ్డ్ గా ఉంటావు మనం పెద్దవాళ్ళ పర్మిషన్ తోనే కదా ఎక్కడికి వచ్చాము అంటాడు ప్రశాంత్. ఏమి మాట్లాడదు రామలక్ష్మి. ఇడ్లీ తీసుకురావడం గమనించి వాష్ రూమ్ కి వెళ్తాను అంటూ లెగుస్తుంది కావాలనే బేరర్ ని డాష్ ఇస్తుంది.

వేడి వేడి సాంబార్ ఇడ్లీ ప్రశాంత్ మీద పడిపోతుంది. మంటతో కేకలు వేస్తాడు ప్రశాంత్. క్లీన్ చేసుకోవటానికి వాష్ రూమ్ కి వెళ్తాడు. జరిగిందానికి సంతోషించిన రామలక్ష్మి బిల్ కన్నా ఎక్కువ డబ్బులు ఇస్తుంది రామలక్ష్మి. సెక్షన్ కి వెళ్ళిన తర్వాత నాకు నువ్వే సెలెక్ట్ చేయు అని కొడుకుని అడుగుతాడు వెంకటరావు. నీకు బట్టలు సెలెక్ట్ చేసే అంత మూడు నాకు లేదు అంటాడు శీను.

బావ మావయ్యకే డ్రెస్సులు సెలెక్ట్ చేయట్లేదు ఇంకా నాకేం సెలెక్ట్ చేస్తాడు వెళ్లి ఆది అక్కని తీసుకొస్తాను తను అయితే మంచి డ్రెస్సులు సెలెక్ట్ చేస్తుంది అనుకుంటూ ఆధ్యని తీసుకువస్తాడు బిట్టు. శీను కోసం డ్రెస్ సెలక్ట్ చేస్తుంటే నువ్వు సెలెక్ట్ చేయవలసింది కాదు నాకు అంటాడు వెంకటరావు. మీ అబ్బాయి వేసుకోకుండా మీరు వేసుకుంటే బాగోదు అంటుంది ఆధ్య.

నిజమే కానీ నేను ఎంత చెప్పినా వాడు కొనుక్కొనంటున్నాడు అంటాడు వెంకటరావు. ఓ కలర్ చెప్పు నేను మంచి సూట్ సెలెక్ట్ చేస్తాను అంటుంది ఆధ్య. ఆమె వైపు చూస్తూ గ్రీన్ కలర్ అంటాడు శీను. తన ఫ్రాక్ వైపు చూసుకుంటుంది ఆధ్య. నేను నిన్ను చూసి చెప్పలేదు నాకు నిజంగానే గ్రీన్ కలర్ ఇష్టం అంటాడు శీను. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.

Follow Us:
Download App:
  • android
  • ios