సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. 

సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో చినబాబు (రాధాకృష్ణ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ధమ్ మసాలా సాంగ్ ఆకట్టుకుంది. 

అయితే నిన్ననే బుధవారం రోజు సెకండ్ సింగిల్ ని రిలీజ్ చేశారు. మహేష్ బాబు, శ్రీలీల సాగే రొమాంటిక్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఓ మై బేబీ అంటూ సాగే ఈ పాట సోసో గా ఉంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావంతో ప్రేక్షకులు ప్రతి సాంగ్ ని, ట్యూన్ ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ గత పాటలని పోలినట్లు అనిపించడం తో మహేష్ ఫ్యాన్స్ కి అంతగా ఎక్కలేదు. 

దీనికి తోడు రామజోగయ్య శాస్త్రి అందించిన లిరిక్స్ కూడా బాగాలేవంటూ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అటు తెలుగు కాకుండా ఇంగ్లిష్ కాకుండా జోగయ్య పదాలు ఉపయోగించారని అంటున్నారు. మహేష్ ఫ్యాన్స్ కి సాంగ్ ఏమాత్రం నచ్చకపోవడంతో దారుణంగా ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. నిన్నటి నుంచి ఆగకుండా ట్రోలింగ్ జరుగుతోంది. 

Scroll to load tweet…

దీనితో సహనం కోల్పోయిన రామజోగయ్య శాస్త్రి సోషల్ మీడియా కుక్కలు అంటూ విరుచుకుపడ్డారు. ట్రోలింగ్ చేసే వాళ్ళకి ప్రాసెస్ గురించి తెలియదు. అది తెలిసినవాళ్ళే కామెంట్ చేయాలి. సోషల్ మీడియా కుక్కలా చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఎవరో ఒకరు మాట్లాడాలి. ప్రతివాడు అభిప్రాయం చెప్పేవాళ్ళే. పాట లెన్త్ తప్ప పాటకి ఏమి తక్కువైంది అంటూ రామజోగయ్య శాస్త్రి ప్రశ్నించారు. 

Scroll to load tweet…

ఓ మై బేబీ సాంగ్ నచ్చని వాళ్ళు తమన్ కి, మహేష్ కి, నాగవంశీ కి ట్యాగ్ చేసి మరీ ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ వివాదం గురించి నిర్మాతలు, సంగీత దర్శకుడు తమన్ స్పందిస్తారేమో చూడాలి. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది .