Asianet News TeluguAsianet News Telugu

నా గర్ల్ ఫ్రెండ్ గోవిందా అని పాడుకుంటున్న అఖిల్!


అక్కినేని హీరో అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్ విడుదలకు సిద్ధం అవుతుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఓ సాంగ్ విడుదల చేశారు. 
 

rama krishna lyrical song from akhil agent movie ksr
Author
First Published Apr 14, 2023, 11:16 AM IST

దర్శకుడు సురేందర్ రెడ్డి రెండేళ్లకు పైగా ఏజెంట్ ని చెక్కుతున్నాడు. ఈ చిత్రానికి ఆయన సహ నిర్మాత కూడాను. పలు కారణాలతో ఏజెంట్ ఆలస్యం అవుతూ వచ్చింది. అనుకున్న సమయానికి చిత్రీకరణ జరగలేదు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 28న ఏజెంట్ వరల్డ్ వైడ్ విడుదల కానుంది. స్పై థ్రిల్లర్ గా దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. అఖిల్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కించారు. విదేశాల్లో రిల్ లొకేషన్స్ లో షూట్ చేశారు.

చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా నేడు 'రామ కృష్ణ' అనే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. హీరో లవ్ బ్రేకప్ ని ఉద్దేశిస్తూ పాడుకుంటున్న ఈ సాంగ్ ఆకట్టుకుంది. రామ కృష్ణ సాంగ్ ని సింగర్ రామ్ మిర్యాల ఆలపించారు. సాహిత్యం ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ అందించారు. ఏజెంట్ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఏ కే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏజెంట్ చిత్రానికి వక్కంతం వంశీ కథ సమకూర్చారు. 

ఏజెంట్ మూవీలో అఖిల్ కి జంటగా సాక్షి వైద్య నటిస్తుంది. అఖిల్ గూఢచారి పాత్రలో యాక్షన్ అదరగొట్టనున్నారు. ఏజెంట్ ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అఖిల్ గత చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మంచి విజయం సాధించింది. పరాజయాలతో ఇబ్బందిపడుతున్న అఖిల్ ని హిట్ ట్రాక్ ఎక్కించింది. ఏజెంట్ తో ఆయన సక్సెస్ ట్రాక్ కొనసాగిస్తారని అభిమానులు భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios