ఎట్టకేలకు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పాడు రామ్ పోతినేని. ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న వారియర్ సినిమాకు సంబంధించి భారీ అప్ డేట్ ఇచ్చాడు.
డిఫరెంట్ స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ... వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు యంగ్ హీరో రామ్ పోతినేని. ఇస్మార్ట్ శంకర్ సినిమాతో రామ్ తనలోని మాస్ యాంగిల్ ను చూపించాడు హీరో. అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో క్యూట్ లుక్స్ తో చాక్లెట్ బాయ్ గా ఉన్న రామ్ ఇస్మార్ట్ శంకర్ తో కంప్లీట్ గా మాస్ హీరోగా మేకోవర్ అయ్యాడు. అంతేకాకుండా ఇస్మార్ట్ శంకర్ సినిమా నుంచి తర్వాత రామ్ కథల ఎంపిక పూర్తిగా మారింది.
మాస్ ఆడియెన్స్‌కు దగ్గరవ్వాలనే ఉద్ధేశ్యంతో మాస్ కథల వైపే మొగ్గుచూపుతున్నాడు రామ్ పోతీనేని. గతేడాది రెడ్ లో కూడా నెగెటీవ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించాడు. ప్రస్తుతం లింగుస్వామి డైరెక్షన్ లో ది వారియర్ సినిమాలో నటిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాగాజా అప్ డేట్ ఇచ్చారు టీమ్.
ఎట్టకేలకు ది వారియర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యింది. రీసెంట్ సెట్‌లో దిగిన ఫోటోస్‌ను షేర్ చేస్తూ షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించారు. చివరి పాటతో షూటింగ్‌ను పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో రామ్ పోలీస్ అధికారిగా కనిపించనున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటి వరకూ రిలీజ్ అయిన ప్రమోషన్ వీడియోస్, టీజర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను నమోదు చేసాయి.
కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ పాత్రలో నటించాడు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మిస్తున్నాడు. ఈ మూవీ జూన్ 14న తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది.
