జనసేన కోసం చిన్న నిర్మాత!

First Published 7, May 2018, 5:26 PM IST
ram thalluri is funding janasena
Highlights

. పార్టీకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఈయనే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట

రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చడం అనేది చాలా మంది చేస్తుంటారు. అవి కూడా రాజకీయ ప్రయోజనాల కోసమేననేది తెలియని విషయం కాదు. కొందరు పార్టీ టికెట్స్ కోసం ఆశించి ఇదంతా చేస్తుంటారు. గతంలో పవన్ కళ్యాణ్ 'జనసేన పార్టీ' కోసం నిర్మాత పివిపి ఫండింగ్ ఇచ్చేవారు. అప్పట్లో ఆయన విజయవాడ నియోజకవర్గానికి సంబంధించి ఎంపి సీట్ ఆశించి ఈ పార్టీపై పెట్టుబడులు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఎంతగా ప్రయత్నించినా.. చంద్రబాబు కారణంగా అది సాధ్యం కాకపోవడంతో ఆ పార్టీకు దూరమయ్యారు పివిపి. అయితే ఇప్పుడు మరో నిర్మాత ఈ పార్టీకు ఫండ్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

'చుట్టాలబ్బాయి' చిత్రంతో నిర్మాతగా పరిచయమైన రామ్ తాళ్ళూరి ప్రస్తుతం 'నేల టికెట్టు' సినిమాను నిర్మిస్తున్నారు. ఎన్నారై అయిన ఈయన ఎమ్మెల్యే కావాలనే ఆశతో జనసేన పార్టీకు నిధులు అందిస్తున్నారని టాక్. పార్టీకు సంబంధించిన కొన్ని వ్యవహారాలు ఈయనే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారట. తను నిర్మిస్తోన్న సినిమాకు కూడా జనసేన పార్టీ మనుషులు పని చేస్తున్నారట. సినిమా వర్గాల ద్వారా ఈ విషయం బయటకు పొక్కింది. మరి ఈ నిర్మాత కోరికనైనా పవన్ తీరుస్తాడేమో చూడాలి! 

loader