Asianet News TeluguAsianet News Telugu

`ఆదిపురుష్‌` నుంచి హృదయాన్ని కదిలించే పాట.. `రామ్‌ సీతా రామ్‌` విడుదల..

`ఆదిపురుష్‌` నుంచి ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌కి విశేష స్పందన దక్కింది. ఇప్పుడు మరో సాంగ్‌ని వచ్చింది. `రామ్‌ సీతా రామ్‌` అంటూ సాగే హార్ట్ టచ్చింగ్‌ సాంగ్‌ని టీమ్‌ విడుదల చేసింది. రాముడు, సీతల మధ్య ప్రేమ, బాధ, భావోద్వేగాల మేళవింపుగా ఈ పాట సాగుతుండటం విశేషం. 
 

ram sitha ram song out from adipurush it really heart touching arj
Author
First Published May 29, 2023, 2:53 PM IST

`ఆదిపురుష్‌` ఒకప్పుడు విమర్శలతో, ట్రోల్స్ తో వార్తల్లో నిలిచింది. ఇప్పుడు పాజిటివ్‌ టాక్‌తో, భారీ అంచనాలతో, క్రేజీ వార్తలతో వార్తల్లో నిలుస్తుంది. ట్రైలర్‌ సినిమాపై అంచనాలను మార్చేసింది. భారీగా పెంచేసింది. ఇప్పటికే విడుదలైన తొలి సాంగ్‌కి విశేష స్పందన దక్కింది. ఇప్పుడు మరో సాంగ్‌ని వచ్చింది. `రామ్‌ సీతా రామ్‌` అంటూ సాగే హార్ట్ టచ్చింగ్‌ సాంగ్‌ని టీమ్‌ విడుదల చేసింది. రాముడు, సీతల మధ్య ప్రేమ, బాధ, భావోద్వేగాల మేళవింపుగా ఈ పాట సాగుతుండటం విశేషం. 

సీతని రావణాసుడు తీసుకెళ్లడంతో ఆ బాధలో రాముడు పాడుకునే పాట, సీతని గుర్తు చేసుకుంటూ ఆయన ఫీల్‌ అయ్యే పాట, సీత దూరం కావడంతో భావోద్వేగానికి గురయినప్పుడు ఆ ఎమోషన్స్ ని ప్రతిబింబించే పాట ఇది. ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇప్పుడు యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. రాముడు, సీతల మధ్య ప్రేమ సన్నివేశాలను, రావణాసుడిని సీత ఎదురించే సన్నివేశాలు, సీత కోసం రాముడు, రాముడి కోసం సీత వేచి చూస్తుండే సన్నివేశాలన్నీ ఈ పాటలో చూపిస్తుండటం విశేషం. అందుకే పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హృదయాలను టచ్‌ చేసేలా ఉంది. 

ఈ పాటని మనోజ్‌ మౌంటషిర్‌ శుక్లా రాయగా, కార్తిక్‌, సచెట్‌ టాండన్‌, పరంపర టండన్‌ ఆలపించారు. సచెట్‌-పరంపర సంగీతం అందించారు. ఈ తెలుగు వెర్షన్‌ని పాటని రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ సాంగ్‌కి విశేషమైన స్పందన దక్కుతున్న నేపథ్యంలో టీమ్‌ స్పందిస్తూ తమ ఆనందాన్ని పంచుకుంది. ఈ పాట గురించి, సినిమా గురించి చెబుతూ, `ఇండియాస్ మోస్ట్ అవెటెడ్ మూవీ ఆదిపురుష్ నుంచి అద్భుతమైన పాట విడుదలైంది. రాఘవ్, జానకిల మంత్రముగ్ధులను చేసే కథతో మనల్ని ఆదిపురుష్‌ ఆకర్షించబోతోంది. సీతారాములుగా ప్రభాస్, కృతి సనన్‌ ద్వయం మెస్మరైజింగ్ గా పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్న ఈ చిత్రం నుంచి రాఘవ్, జానకిల ప్రేమలోని గాఢతను తెలియజేసేలా సాగే మెలోడియస్ జర్నీ 'రామ్ సీతా రామ్' పాటకి విశేష స్పందన లభిస్తుంది.

మంత్రముగ్ధులను చేసే సంగీతం, మనోహరమైన గాత్రాలకు అతీతంగా, శ్రావ్యమైన ట్రాక్ ప్రభు శ్రీరామ్, సీతమ్మ గుణగణాలను వర్ణిస్తూ, వారి ధర్మాన్ని, కరుణ, దైవిక దయను హైలైట్ చేస్తూ, మంత్రముగ్ధులను చేసే ఆదిపురుష్ ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకువెళుతుంది. సచేత్-పరంపర స్వరపరచిన ఈ గీతం  మధురమైన స్వరాలతో నెమ్మదిగా సాగుతూ హృదయాలను తాకేలా ఉంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం, సీతారాముల మధ్య పంచుకున్న లోతైన అనుబంధాన్ని స్పష్టంగా చిత్రీకరిస్తుంది. పాట ప్రారంభంలోనే, ఇది సీతారాముల జీవితంలో వారి బంధం ప్రాముఖ్యతను ప్రదర్శిస్తుంది. నిజమైన ప్రేమ యొక్క శాశ్వతమైన శక్తిని, మానవ భావోద్వేగాల యొక్క శాశ్వతమైన లోతును ఈ పాట గుర్తుచేస్తుంది` అని టీమ్‌ వెల్లడించింది. 

ప్రభాస్‌, కృతి సనన్‌ జంటగా, సైఫ్‌ అలీ ఖాన్‌ కీలక పాత్రలో నటించిన `ఆదిపురుష్‌` చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్‌, క్రిష్ణ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతారియ, రెట్రోఫిల్స్ రాజేష్‌ నాయర్‌, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక భాషల్లో, వివిధ దేశాల్లో విడుదల కాబోతుంది. ఈ నెల 6న తిరుపతిలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించబోతున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios