హీరో రామ్‌ ఇన్నాళ్లూ  కేవ‌లం సినిమాల‌తోనే ప్రేక్షకుల‌ను ప‌లుక‌రించాడు. అయితే తాజాగా ఈ నటుడు తొలిసారి ఓ యాడ్ లో కనపించి తన ఫ్యాన్స్ ని సర్పైజ్ చేసారు. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో జాన్ అబ్రహాంతో క‌లిసి ప్రక‌ట‌న‌లో మెరిశాడు. జాన్ అబ్రహాంతో క‌లిసి పుష్ అప్స్ చేస్తూ..మ‌రోవైపు  గార్నియ‌ర్ మ్యాన్ షాంపును ప్రమోట్ చేస్తున్నాడు రామ్‌.  ఈ యాడ్ లో రామ్ న్యూ లుక్ లో ఆకట్టుకున్నాడు. అలాగే అతని హిందీ మాడ్యులేషన్ కూడా బాగుందంటూ  ప్రశంసలు వస్తున్నాయి.

ఇదిగో నా మొట్టమొద‌టి బ్రాండ్ ఎండార్స్ మెంట్‌..గార్నియ‌ర్ మ్యాన్ తో అసోసియేట్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. యాడ్ షూటింగ్, డ‌బ్బింగ్ చాలా  ఎంటర్టైన్మెంట్ గా, ఫ‌న్నీగా సాగింది. ఈ టీంతో సుదీర్ఘంగా అసోసియేట్ అయ్యేందుకు ఎదురుచూస్తున్నా అంటూ ట్వీట్ చేశాడు రామ్‌. 

రామ్ ప్రస్తుతం రెడ్ సినిమాలో న‌టిస్తున్నాడు. మాళ‌వికా శ‌ర్మ‌. అమృతా అయ్యర్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు.  
 ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ సినిమాల తర్వాత దర్శకుడు కిషోర్ తిరుమలతో మూడోసారి కలిసి రామ్ చేసిన చిత్రం ఇది కావటంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.