ఎనర్జిటిక్ హీరో రామ్ నటించిన 'ఇస్మార్ట్ శంకర్' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మాస్ ఆడియన్స్ లో ఈ సినిమాకి చక్కటి ఆదరణ లభించింది. చాలారోజుల తరువాత దర్శకుడు పూరి జగన్నాథ్ కి సక్సెస్ రావడంతో చిత్రబృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.

ఈ సినిమా కోసం రామ్ ఎంతో కష్టపడ్డాడు. సినిమాకి హిట్ టాక్ రావడంతో అమెరికాకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్నాడు. 'ఇస్మార్ట్ శంకర్' సినిమా తరువాత రామ్ ఓ తమిళ రీమేక్ లో నటించాల్సివుంది. కోలీవుడ్ లో సక్సెస్ అయిన 'తడం' అనే సినిమా తెలుగు రైట్స్ రామ్ పెదనాన్న ప్రముఖ నిర్మాత స్రవంతి రవికిషోర్ దక్కించుకున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో సినిమాను తెరకెక్కించాలను నిర్ణయించుకున్నారు. 

రామ్ హీరోగా అనుకున్నారు. ఫైనల్ డ్రాఫ్ట్ విన్న తరువాత రామ్ ఈ సినిమా చేయకూడదని నిర్ణయించుకున్నారట. కథ, కథనాలు బాగానే ఉన్నప్పటికీ రీమేక్ అనేసరికి రామ్ వెనకడుగు వేస్తున్నాడు. తనకు సినిమా నచ్చినా.. రిస్క్ తీసుకోలేకపోతున్నాడు. దీంతో సినిమా హోల్డ్ లో పడింది. రామ్ కి బదులుగా మరో హీరోని తీసుకోవాలా..?లేక కొన్నాళ్లు సినిమాను పక్కన పెట్టాలా..? అనే డైలమాలో పడిపోయాడు స్రవంతి రవికిషోర్.

ప్రస్తుతం రామ్ దర్శకులను కలుస్తూ తన తదుపరి సినిమా కోసం కథలు వింటున్నాడు. ఇటీవల గుండు కొట్టించడంతో కొద్దిరోజులు గ్యాప్ తీసుకొని సినిమాలు చేయాలనుకుంటున్నాడు రామ్. త్వరలోనే స్క్రిప్ట్ ఒకే చేసి అధికారికంగా ప్రకటించనున్నాడు.