రామ్ ఆ పాత్రకు సెట్ అవుతాడా...జనాల డౌట్
ఇప్పుడు రామ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడని మీడియాలో వార్త. ఎంతవరకూ నిజం అనేది ప్రక్కన పెడితే...ఆ పాత్రకు రామ్ సరిపోతాడా అనే డిస్కషన్ మొదలైంది.
కొన్ని పాత్రలకు కొందరు హీరోలు ఫెరఫెక్ట్ ఛాయిస్ గా ఉంటారు. ఇస్మార్ట్ శంకర్ కు ముందు వరకూ రామ్ ని చూస్తే ప్రక్కింటి కుర్రాడిలా ఉండేవాడు. ఆ తర్వాత మాస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు. అయితే ఇప్పుడు రామ్ ఓ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నాడని మీడియాలో వార్త. ఎంతవరకూ నిజం అనేది ప్రక్కన పెడితే...ఆ పాత్రకు రామ్ సరిపోతాడా అనే డిస్కషన్ మొదలైంది. కొందరు రామ్ ఆ పాత్రకు సూట్ కాడు అని వాదిస్తూంటే..మరికొందరు అదేం లేదు...రామ్ ఏ పాత్ర వేసినా ప్రాణం పోసేస్తాడు అని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే... రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. కృతి శెట్టి హీరోయిన్. శ్రీనివాసా సిల్వర్ స్ర్కీన్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో రామ్ పవర్‌పుల్ పోలీస్ అధికారి పాత్రలో నటించనున్నాడట. పవన్ కుమార్ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్‌టైనర్ అలరించడంతో పాటు, సామాజిక సందేశాన్ని అందివ్వనుందట. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సినిమా తెలుగు - తమిళంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కనుంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాణ సంస్థ యోచిస్తున్నట్లు సమాచారం.
ఇక ఈ చిత్రనికి హై బడ్జెట్ కేటాయించి భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు. ఊరమాస్ కథతో ప్రేక్షకులను మెప్పించేలా కథ రెడీ చేస్తున్నారట లింగుస్వామి. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ సినిమాలో రామ్ సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతిశెట్టిని తీసుకోవటం ప్లస్ అవుతుందని అంటున్నారు. ఈ సినిమాలో రామ్‌ని డిఫరెంట్ షేడ్‌లో చూపించబోతున్నారట. అలాగే హీరోయిన్ రోల్‌కి కూడా ప్రాధాన్యత ఇస్తూ డిఫరెంట్‌గా ఉండేలా ప్లాన్ చేశారట మేకర్స్. సో...త్వరలో ఓ మాస్ ఎంటర్టైనర్ ని చూడబోతున్నాం అన్నమాట.
ఈ మేరకు గతంలో రామ్ ట్విటర్‌లో పోస్టు పెట్టాడు. ‘దీని కోసం చాలా కాలం ఎదురు చూశాను. నా ఫేవరెట్ దర్శకుడు లింగు స్వామి సర్‌తో రాపో19 తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. శ్రీనివాస చిత్తూరితో పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నాను. లవ్ రాపో’ అంటూ ట్వీట్ చేశాడు.