Asianet News TeluguAsianet News Telugu

The Warrior Teaser: గ్యాంగ్ స్టార్స్ కు పాన్‌ ఇండియా రౌడీయిజం చూపిస్తున్న రామ్.. కొట్టి మరీ టాబ్లెట్‌ ఇస్తుండట

తమిళ డైరెక్టర్ లింగుస్వామి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ది వారియర్’. ఈ మూవీలో రామ్ ఊరమాస్ పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపుతున్నాడు. తాజాగా చిత్రం నుంచి హై వోల్టేజ్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్.   
 

Ram Pothineni The Warrior Movie Teaser Release
Author
Hyderabad, First Published May 14, 2022, 6:22 PM IST

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni), దర్శకుడు ఎన్ లింగుస్వామి కాంబినేషన్ లో వస్తున్న యాక్షన్ డ్రామా ‘ది వారియర్’ (The Warrior). ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాలత తర్వాత మరోసారి మాస్ విజువల్స్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు హీరో రామ్. ఈ చిత్రం నుంచి రిలీజ్ అయినా పోస్టర్స్, సాంగ్స్ కూడా సినిమాలో బోలెడంత మాస్ కంటెంట్ ను ఉన్నట్టు చూపిస్తున్నాయి. ఇఫ్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, ఫస్ట్ సింగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా రామ్ పోతినేని పుట్టిన రోజు సందర్భంగా తాజాగా టీజర్ ను వదిలారు.

ది వారియర్.. టీజర్ ఫుల్ ఆఫ్ మాస్ కంటెంట్ తో నిండిపోయింది. రామ్ పోతినేని పోలీస్ ఆఫీసర్ లుక్ లో దుమ్ములేపుతున్నారు. ‘ఈ పోలీసోళ్ల టార్చర్ భరించలేకపోతున్నాం అబ్బా’ అనే వాయిస్ ఓవర్ తో టీజర్ స్టార్ అవుతుంది. టీజర్ లో రామ్ పోతినేని మాస్ పోలీస్ ఆఫీసర్ గా దుమ్ములేపాడు. సరికొత్త లుక్ లో డిఫరెంట్ మ్యానరిజాన్ని చూపిస్తున్నారు రామ్. హీరోయిన్ కృతి శెట్టి రామ్ కు ధీటుగా కనిపిస్తోంది. సినిమాలో వీరిద్దరి రొమాన్స్ నెక్ట్స్ లెవల్ గా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇక విలన్ పాత్రలో ఆదిపినిశెట్టి అదరగొట్టాడు. విలనిజంలో కొత్తదనం చూపించాడు ఆది. దీంతో రామ్ పోతినేని, ఆది మధ్య వార్ చాలా ఇంట్రెస్టింగ్ కనిపిస్తోంది. ‘పాన్ ఇండియా సినిమా చూసి ఉంటారు.. పాన్ ఇండియా రౌడీని చూశారా.. మై డియర్ గ్యాంగ్ స్టార్స్ వీలైతే మారిపోండి.. లేదంటే పారిపోండి ఇదేనేను మీకిచ్చే ఫైనల్ వార్నింగ్’ అంటూ రామ్ పోతినేని చెప్పే డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ‘ధైర్యమంటే వెతుక్కుంటూ వచ్చిన వాణ్ని కొట్టడం కాదు.. వెతుక్కుంటూ వెళ్లి కొట్టడం’ అంటూ ఫీమెయిల్ వాయిస్ లో వచ్చే డైలాగ్ ఆకట్టుకుంటోంది. దేవీశ్రీప్రసాద్ బీజీఎం అదిరిపోయింది. అయితే రౌడీలను చితక్కొట్టి మరీ టాబ్లెట్స్ ఇవ్వడం హైలెగా నిలిచింది.

సత్య ఐపీఎస్ గా రామ్ పోతినేని ‘ది వారియర్’లో కనిపించనున్నారు. విజిల్ మహాలక్ష్మి పాత్రలో కృతి శెట్టి (Krithi Shetty) నటిస్తోంది. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. రామ్ పోతినేని మాస్ విజువల్స్ భారీ అంచనాలను నెలకొల్పేలా ఉన్నాయి.  శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్నారు. జులై 14న వరల్డ్ వైడ్ ‘ది వారియర్’ మూవీ రిలీజ్ కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios