హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం 'ది వారియర్'. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి, రామ్ తొలిసారి జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.
హీరో రామ్ పోతినేని నటిస్తున్న తాజా చిత్రం 'ది వారియర్'. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తమిళ దర్శకుడు లింగుస్వామి, రామ్ తొలిసారి జత కట్టడంతో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంపై రామ్ కూడా చాలా ఆసక్తిగా ఉన్నాయి. రామ్ సరసన ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ చిత్రంలో రామ్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత మాస్ లో రామ్ క్రేజ్ అమాంతం పెరిగింది. దీనితో వారియర్ చిత్రంపై రామ్ స్పెషల్ ఫోకస్ పెట్టాడు. హీరోలని పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేయడంలో లింగుస్వామి సిద్ధహస్తుడు.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంటోంది. నెమ్మదిగా ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు. తెలుగు తమిళ ద్విభాషా చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో 'బులెట్' అనే సాంగ్ ని క్రేజీ హీరో శింబు పాడుతున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించారు. తాజాగా ఆ సాంగ్ ప్రోమో రిలీజ్ చేశారు.
మంచి డాన్స్ బీట్ తో దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ని కంపోజ్ చేసినట్లు అర్థం అవుతోంది. ప్రోమో చూస్తుంటే.. మాస్ ప్రేక్షకులకు వెంటనే ఈ సాంగ్ నచ్చేలా ఉంది. రామ్, కృతి శెట్టి ఇద్దరూ డాన్స్ తో అదరగొడుతున్నారు. ఇద్దరి కాస్ట్యూమ్స్ స్టైలిష్ గా ఉన్నాయి. ఈ సాంగ్ కి శ్రీమణి సాహిత్యం అందించారు.
తెలుగు, తమిళం రెండు భాషల్లో ఈ సాంగ్ శింబు పాడడం విశేషం. రామ్ సినిమాకి తాను పాట పాడడం సంతోషంగా ఉందని శింబు తెలిపాడు. కంప్లీట్ లిరికల్ వీడియో ఏప్రిల్ 22న రిలీజ్ కానుంది.

