#Skanda: OTT రిలీజ్ పోస్ట్ ఫోన్ ? కారణం
గత నెల 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ సందడి చేయడానికి సిద్దమైంది. ఈ నెల 27 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చింది.

రామ్ పోతినేని- శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ అయ్యిన మాస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'స్కంద'. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. పాన్ ఇండియా సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజు మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. బోయపాటి సినిమాలో స్టోరీ కంటే యాక్షన్ అంశాలు ఎలివేషన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
“స్కంద” ఫ్యామిలీ సెంటిమెంట్ సన్నివేశాలు కొన్నిచోట్ల పర్వాలేదు అనిపించినా కానీ చాలా వరకు.. స్టోరీకి యాక్షన్ సన్నివేశాలకి సంబంధం లేకుండా ఓవర్ గా ఉండటంతో జనాలకు తిరస్కరించారు. యాక్షన్స్ సన్నివేశాలలో రామ్ ని చాలా అద్భుతంగా చూపించారని టాక్ వచ్చినా ఫలితం లేదు. అప్పటికీ డాన్స్ పరంగా కూడా యధావిధిగా రామ్ వంద న్యాయం చేశాడు. తమన్ అందించిన మ్యూజిక్ కూడా సినిమాకి హైలైట్ గా నిలిచింది. అవేమీ సినిమాని నిలబెట్టలేదు. నెగిటివ్ టాక్ కావటంతో చాలా మంది థియేటర్ కు వెళ్లటం మాని ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు.
గత నెల 28న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీ సందడి చేయడానికి సిద్దమైంది. ఈ నెల 27 నుంచి డిస్నీప్లస్ హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుందని ప్రకటన వచ్చింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలతోపాటు హిందీలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వస్తోందని ఎదురుచూస్తున్నారు.. నిజానికి రాత్రి 12 దాటాక సినిమా ఓటిటిలో వచ్చేస్తుందని ఎక్సపెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఓటిటి స్ట్రీమింగ్ గురించి ఒక్క అప్డేట్ రాలేదు. ఈ క్రమంలో ఈ సినిమా ఓటిటి స్ట్రీమింగ్ పోస్ట్ ఫోన్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. టెక్నికల్ రీజన్స్ తో నవంబర్ రెండవ వారానికి ఈ సినిమా ఓటిటిలో వస్తుందని సమాచారం. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.
చిత్రం కథ:
పెళ్లిపీటలపై కూర్చున్న ఆంధ్రప్రదేశ్ సీఎం కూతురిని... తెలంగాణ సీఎం అబ్బాయి వచ్చి తీసుకెళతాడు. దాంతో ఇద్దరి సీఎంల మధ్య వైరం మొదలవుతుంది. ఒకరినొకరు చంపుకునే వరకూ వెళుతుంది. ఆ తర్వాత ఆంధ్ర ముఖ్యమంత్రి ఓ యువకుడిని (రామ్) రంగంలోకి దింపుతాడు. ఎవ్వరినైనా ఎదిరించి అనుకున్నది సాధించే ఆ యువకుడు కట్టుదిట్టమైన భద్రతను కాదని తెలంగాణ సీఎం ఇంట్లోకి అడుగు పెట్టాడా? ఇద్దరు ముఖ్యమంత్రుల కూతుళ్లనీ కిడ్నాప్ చేసి రుద్రరాజపురం తీసుకెళ్లిన ఆ యువకుడు ఎవరు? ఇంతకీ ఆ ఊళ్లో ఎవరున్నారు? ఈ కిడ్నాప్‌లకీ క్రౌన్ గ్రూప్ కంపెనీస్ అధినేత రామకృష్ణంరాజు (శ్రీకాంత్)కీ మధ్య సంబంధం ఏంటి అన్నది మిగతా కథ. రామ్ చెప్పే పంచ్ డైలాగ్‌లు 'ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే' వంటివి బాగా పేలాయి. అలాగే సిఎం జగన్ పై కూడా కొన్ని సెటైర్స్ వేసారు.
రామ్ పోతినేని, శ్రీ లీల జంటగా నటించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ రెండో హీరోయిన్ . శ్రీకాంత్, ఇంద్రజ, గౌతమి, పృథ్వీరాజ్, ప్రిన్స్ ప్రధాన తారాగణం. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ చేశారు. 'స్కంద' చిత్రానికి కూర్పు : తమ్మిరాజు, ఛాయాగ్రహణం : సంతోష్ డిటాకే, సమర్పణ : జీ స్టూడియోస్ సౌత్, పవన్ కుమార్, సంగీతం : ఎస్ తమన్, నిర్మాత : శ్రీనివాస చిట్టూరి, రచన - దర్శకత్వం : బోయపాటి శ్రీను.