సారాంశం
స్కంద మూవీ వసూళ్లు నిలకడగా ఉన్నాయి. ఆదివారం రోజు స్వల్పంగా పెరగడం ఆసక్తికర పరిణామం.
విడుదలకు గోల్డెన్ డేట్ ను ఎంచుకుంది స్కంద యూనిట్. సలార్ విడుదల వాయిదా ఈ చిత్రానికి కలిసొచ్చింది. అదే సమయంలో పోటీగా విడుదలైన పెదకాపు 1, చంద్రముఖి 2 డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న స్కందకు కలిసొచ్చింది. భారీ నష్టాల నుండి బయటపడింది. ఇక స్కంద వసూళ్లు తెలుగు రాష్ట్రాల్లో నిలకడగా ఉన్నాయి.
ఏపీ/తెలంగాణాలలో ఫస్ట్ డే స్కంద రూ. 8.52 కోట్లు, సెకండ్ డే రూ. 3.50 కోట్లు, థర్డ్ డే రూ.3.27 కోట్లు వసూలు చేసింది. అయితే ఆదివారం స్కంద వసూళ్లు పెరగడం కలిసొచ్చే అంశం. స్కంద నాలుగో రోజు రూ.4.46 కోట్ల షేర్ వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులకు స్కంద రూ.19.85 కోట్ల షేర్, 32.20 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ రూ. 23.40 కోట్ల షేర్, 39.60 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
స్కంద చిత్రం దాదాపు రూ. 46 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రామ్ హిట్టు కొట్టి చానళ్ళు అవుతున్నా బోయపాటి శ్రీనుపై నమ్మకంతో బిజినెస్ జరిగింది. రూ. 47 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన స్కంద రాబట్టాల్సిన వసూళ్లు చాలా ఉన్నాయి. మరో రూ. 24 కోట్ల వసూళ్లు రాబట్టి హిట్ స్టేటస్ తెచ్చుకోవడం కష్టమే అని చెప్పాలి. వర్కింగ్ డేస్ లో వసూళ్లను బట్టి చిత్ర ఫలితం తెలుస్తుంది. స్కంద మూవీలో రామ్ కి జంటగా శ్రీలీల నటించింది. థమన్ సంగీతం అందించారు. సాంగ్స్, బీజీఎం విషయంలో థమన్ ఫెయిల్ అయ్యాడన్న మాట వినిపిస్తుంది. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు.