ఎండకి పగిలిపోయిన అరికాలు.. షాకింగ్‌ ఫోటో పంచుకున్న రామ్‌ పోతినేని.. పరోక్షంగా `స్కంద`పై ట్రోల్స్ కి కౌంటర్‌ ?

`స్కంద` మూవీపై ఇటీవల ట్రోల్స్ బాగా వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రామ్‌ పోతినేని పెట్టిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. ఆయన పెట్టిన ఫోటో షాకిస్తుంది.
 

ram pothineni shared shocking photo from the set of skanda did this counter of trolls on movie ? arj

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని సోషల్‌ మీడియాలో చాలా అరుదుగా రియాక్ట్ అవుతుంటారు. చాలా సెలక్టీవ్‌గా ఉంటారు. కానీ తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ అందరిని ఆశ్చర్యపరుస్తుంది. అదే సమయంలో ఆలోచింప చేస్తుంది. రామ్‌.. `స్కంద` చిత్ర షూటింగ్‌లో చోటు చేసుకున్న ఒక సంఘటనని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌(ఎక్స్) చేశారు. ఇందులో సినిమా షూటింగ్‌ కోసం తాను ఎంత కష్టపడ్డాడో చూపించారు. అందుకు నిదర్శనంగా ఆ సమయంలో తీసిన ఫోటోని పంచుకున్నారు. 

ఇందులో రామ్‌ అరికాలు ఎండకి పగిలిపోయి ఉంది. వేడికి గాట్లు పడి కమిలిపోయినట్టుగా ఉంది. నేల బీటలు పారినట్టుగా ఆయన అరికాలు బీటలు వారింది. దీని స్టోరీని వెల్లడించారు రామ్‌. ఈ ఏడాది ఏప్రిల్‌ 22 తీసిన ఫోటో ఇది అని చెప్పారు. ఎండలో అత్యంత వేడిగా ఉండే రోజుల్లో అదొకటని చెప్పారు. 25రోజులపాటు జరిగిన షెడ్యూల్‌లో అది మూడో రోజు అట, అలా మారిపోయాయని, సరిగ్గా నడవలేని పరిస్థితి ఎదురైందన్నారు. 

కాళ్లు ఎండకి పగిలిపోవడంతో రక్తం కారుతుందని, అయినా తన దర్శకుడు(బోయపాటి శ్రీను) షాట్‌ బాగా రావడం కోసం ఇలా చేశాడని, దీంతో తన కాలు కాలిపోయిందని తెలిపారు. సినిమా కంటెంట్‌ని ఇష్టపడటం, ఇష్టపడకపోవడమనేది పూర్తిగా ఆడియెన్స్ ఛాయిస్‌. నేను వారి అభిప్రాయాలను గౌరవిస్తాను. అన్నింటిని పక్కన పెడితే ఇదంతా మీకోసం పడ్డ కష్టం. అయినప్పటికీ ఇంతటి కష్టపడి ప్రత్యేకంగా తనకోసం షాట్స్ తీసిన దర్శకుడికి ధన్యవాదాలు అని తెలిపారు రామ్‌. ప్రేమతో మీ రామ్‌ అని పేర్కొన్నారు. 

ఇందులో ప్రత్యేకంగా ఓ విషయాన్ని ప్రస్తావించారు రామ్‌. మీ కోసం చేసే ప్రతి సినిమా కోసం నేను నా బ్లడ్‌, స్వెట్‌ పెడతాను, అది జీరో అంచనాలతో` అని వెల్లడించారు రామ్‌. ఫ్యాన్స్ కోసం తాను ఏమైనా చేస్తానని, వారిని అలరించడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల `స్కంద` సినిమాపై ట్రోల్స్ బాగా వస్తున్నాయి. సినిమాలో లోపాలు ట్రెండ్‌ అవుతున్నాయి. బోయపాటి చేసిన మిస్టేక్స్ గురించి ట్రోల్ చేస్తున్నారు, అదే సమయంలో మ్యూజిక్‌ బాగలేదని బోయపాటి అన్నట్టుగా, దీంతోపాటు సీన్‌లో దమ్ము లేకపోతే తాను ఏం చేయలేనని థమన్‌ చెప్పిన డైలాగ్‌లను యాడ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఈ క్రమంలో రామ్‌ స్పందన ఆసక్తికరంగా మారింది. ఆయన పరోక్షంగా `స్కంద`పై ట్రోల్స్ కి కౌంటర్‌గానే ఈ పోస్ట్ పెట్టారనే వాదన వినిపిస్తుంది. దీంతో ఇప్పుడిది వైరల్‌ అవుతుంది. 

ఇక రామ్‌ పోతినేని హీరోగా, శ్రీలీల, సాయీ మంజ్రేకర్‌ హీరోయిన్లుగా రూపొందిన `స్కంద` మూవీ సెప్టెంబర్‌ 28న విడుదలైంది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద నెగటివ్‌ టాక్‌ని తెచ్చుకుంది. అయితే ఈ చిత్రానికి రెండో పార్ట్ కూడా ఉందని ప్రకటించడం విశేషం. మరి అది ఉంటుందా? లేదా అనేది చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios