రామ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇస్మార్ట్‌ శంకర్‌’. ఈ  సినిమా షూటింగ్‌ ఇప్పటికే ప్రారంభమై శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.  అలాగే చిత్రం ఫస్ట్ లుక్ లో 'డబుల్‌ ధిమాక్‌ హైద్రాబాదీ.. డబుల్‌ సిమ్‌ కార్డ్‌..' అంటూ ఇంట్రస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసారు.  దీన్నే హ్యాష్ ట్యాగ్స్ గా పెడుతూ ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రం స్టోరీ లైన్ ఏంటనేది ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. 

ఇండస్ట్రీలో చెప్పుకునేదాని ప్రకారం .."ఇస్మార్ట్ శంకర్" కథలో హీరోకు గతం మర్చిపోతూంటాడు. కాసేపు గుర్తు వస్తూంటుంది. గతం గుర్తుకు వచ్చనప్పుడు అందుకు సంభందించిన విలన్స్ పై ఎటాక్ చేస్తూంటాడు. ఆ విషయం తెలిసిన వాళ్లు...గతం గుర్తు లేని టైమ్ లోనే అతని ఎదురుగా ఉండటానికి ప్రయత్నిస్తూంటారు. ఎప్పుడు ఏ మూడ్ లో ఉంటాడో తెలియక వాళ్లు పడే తిప్పలు నవ్వు తెప్పిస్తాయి.

ఈ లోగా అతన్ని డ్యూయిల్ సిమ్ గా మార్చిన వారిపై ఎలా పగ తీర్చుకున్నాడు ఈ క్రమంలో అనేది ఇంట్రస్టింగ్ గా సాగుతుందంటున్నారు. క్లైమాక్స్ లో ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందిట. అసలు ఇదంతా కావాలని హీరో ఆడే డ్రామా టైప్ లో ఆ ట్విస్ట్ రివీల్ అవుతుందంటున్నారు. మరో ప్రక్క ఈ డ‌బుల్ సిమ్ హీరోకి డ‌బుల్ హీరోయిన్లున్నారు ఇందులో. ఒక భామ న‌భా న‌టేష్‌. మ‌రో సుంద‌రి నిధి అగ‌ర్వాల్‌. 

ఈ సినిమాను పూరీ కనెక్ట్స్‌ పతాకంపై పూరీ, ఛార్మి నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కోసం రామ్‌  మరింత ఫిట్‌గా తయారయ్యారు. ఇందులో ఆయన విభిన్నమైన మాస్‌ పాత్రలో కనిపించనున్నారట. ఈ ఏడాది కుదిరిన క్రేజీ కాంబినేషన్‌ ఇది. ఎనర్జిటిక్‌ స్టార్‌, డ్యాషింగ్‌ డైరెక్టర్‌ కలిసి ప్రేక్షకుల్ని ఎలా అలరించబోతున్నారో చూడాలి. ‘మెహబూబా’ సినిమా తర్వాత పూరీ తీస్తున్న చిత్రమిది. రామ్‌ గత ఏడాది ‘హలో గురు ప్రేమకోసమే’ సినిమాతో యావరేజ్ ఫలితాన్ని అందుకున్నాడు.