రామ్‌ పోతినేని పెళ్లి చేసుకోబోతున్నట్టు ఇటీవల కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై రామ్‌ స్పందించారు. 

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని(Ram Pothineni)కి సంబంధించిన ఇటీవల పెళ్లి వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. రామ్‌ మ్యారేజ్‌(Ram Marriage Rumors)కి సిద్ధమయ్యాడని, త్వరలోనే ఆయన పెళ్లి చేసుకోబోతున్నారని, తన స్కూల్‌ మేట్‌తోనే మ్యారేజ్‌ అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. టాలీవుడ్‌లోనూ ఇవి హాట్‌ టాపిక్‌ అయ్యాయి. నెట్టింట విపరీతంగా హల్‌ చల్‌ చేయడంతో ఆ వార్తలు కాస్త రామ్‌ ఫ్యామిలీకి చేరాయి. ఫ్రెండ్స్ సైతం దీనిపై రామ్‌ని ఆరా తీసే పరిస్థితి ఎదురయ్యిందట. ఈనేపథ్యంలో దీనిపై రామ్‌ పోతినేని స్పందించారు. 

ట్విట్టర్‌ ద్వారా రామ్‌ తాను పెళ్ళి చేసుకోబోతున్నారనే వార్తలకు క్లారిటీ ఇచ్చారు. `ఓ గాడ్‌, ఇక ఆపండి. నేను హైస్కూల్‌ సీక్రెట్‌ స్వీట్‌ హార్ట్(ప్రియురాలు)ని పెళ్లి చేసుకోబోతున్నాననే వార్తలు ఇంటి వరకు చేరాయి. నేను ఏ స్వీట్‌ హార్ట్ ని పెళ్లి చేసుకోవడం లేదని ఫ్యామిలీ మెంబర్స్‌, ఫ్రెండ్స్ ని ఈ సైతం కన్విన్స్ చేయాల్సి వచ్చింది. కనీసం హైస్కూల్‌లో నేను సరిగ్గా స్కూల్‌కి వెళ్లింది కూడా లేదు` అంటూ ట్వీట్‌ చేశారు రామ్‌. మొత్తానికి తన మ్యారేజ్‌పై రామ్‌ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తడం గమనార్హం. 

Scroll to load tweet…

అయితే హీరోలు, హీరోయిన్లు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సమయంలో ఏదో రూపంలో రూమర్స్ చక్కర్లు కొడుతుంటాయి. రామ్‌ విషయంలోనూ అదే జరిగింది. ఆయన ప్రస్తుతం `ది వారియర్` చిత్రంలో నటిస్తున్నారు. అయితే ఈ రూమర్స్ ఆయన ఫ్యామిలీని కాస్త డిస్టర్బ్ చేసినా, సినిమా పరంగా హెల్ప్ అయ్యాయని అంటున్నారు ఫ్యాన్స్. అందరి అటెన్షన్‌ ఆయన సినిమాపైకి వెళ్తుందని సర్ది చెబుతున్నారు. ఇక కృతి శెట్టితో కలిసి రామ్‌ నటించిన `ది వారియర్` చిత్రం జులై 14న విడుదల కాబోతుంది. 

తమిళ దర్శకుడు లింగుస్వామి రూపొందించిన చిత్రమిది. తెలుగు, తమిళంలో తెరకెక్కించారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇందులో ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సామాజిక మాధ్యమాల్లో, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అయ్యాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ని జులై 1న సాయంత్రం విడుదల చేయబోతున్నారు. దీంతోపాటు రామ్‌.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు రామ్‌.