రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబోలో మూవీ తెరకెక్కుతుండగా కొత్త రిలీజ్ ప్రకటించారు. దాదాపు ఓ నెల ముందే వచ్చేస్తున్నారు.  


రామ్ పోతినేని-బోయపాటి శ్రీను ఫస్ట్ టైం కలిసి చిత్రం చేస్తున్నారు. టైటిల్ ప్రకటించాల్సి ఉండగా చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యింది. ఇటీవల రామ్ పోతినేని బర్త్ డే కానుకగా ప్రోమో విడుదల చేశారు. మాస్ అవతార్ లో విలన్స్ ని ఇరగ్గొడుతున్న రామ్ ఆకట్టుకున్నారు. దున్నపోతుతో జాతరలో ఆయన హంగామా అదిరింది. ఇక బోయపాటి మార్క్ మాస్ డైలాగ్స్ కూడా ఉన్నాయి. పాన్ ఇండియా చిత్రంగా ఐదు భాషల్లో విడుదల చేస్తున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ డేట్ పై చాలా చిత్రాలు కన్నేశాయి. ఈ క్రమంలో విడుదల తేదీ ముందుకు జరపాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని ప్రచారం జరిగింది. అనుకున్నట్లే రామ్ పోతినేని విడుదల తేదీ మార్చేశారు. అక్టోబర్ 20కి బదులు సెప్టెంబర్ 15న విడుదల చేస్తున్నారు. ఈ మేరకు నేడు అధికారిక పోస్టర్ విడుదల చేశారు. 

సినిమాను ప్రీఫోన్ చేయడం వెనుక కారణం కాంపిటీషన్ అవైడ్ చేసేందుకే కావచ్చు. దసరా బరిలో బాలకృష్ణ భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వరరావు చిత్రాలు ఉన్నాయి. ఈ క్రమంలో రామ్ పోతినేని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 

Scroll to load tweet…

ఈ చిత్రంలో రామ్ పోతినేనికి జంటగా శ్రీలీల నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ సమర్పిస్తున్నారు. కాగా అఖండ హిట్ తో బోయపాటి శ్రీను ఫార్మ్ లోకి వచ్చాడు. రామ్ మాత్రం వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్నాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ కి హిట్ లేదు. బోయపాటి మీదే ఆశలు పెట్టుకున్నాడు.