కెరీర్ ప్రారంభంలోనే మాస్ సినిమా దేవదాస్ చేసినా ఆ తర్వాత ఆ ఒరవడి కొనసాగించలేకపోయాడు రామ్. తన తోటి మాస్ హీరోల నుంచి పోటీ తట్టుకునేందుకు  ఫన్ సినిమాల వైపు తన ప్రయాణం పెట్టుకున్నాడు. మధ్యలో జగడం లాంటి సినిమాలు చేసినా అవి సరైన ఫలితం ఇవ్వలేదు. దాంతో వరసగా ఫన్, లవ్ ఎంటర్టైనర్స్ నే నమ్ముకున్నాడు. ఆ మధ్యన ఆ సినిమాలు కూడా మొనాటినీ వచ్చేసాయి.

అదే సమయంలో  ఇస్మార్ట్ శంకర్ కథని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చేసి మెగా హిట్ కొట్టాడు. దాంతో ఇప్పుడు మరో సారి మాస్ సినిమాతోనే ముందుకు వెళ్లాలని ఫిక్సయ్యాడు. అయితే ఈ తరంలో పక్కా మాస్ ఎంటర్టైనర్స్ చేసే దర్శకులు ఎవరు ఉన్నారు..ఎవరు తన దగ్గరకు వచ్చినా లవ్ ఎంటర్టైనర్సే తెస్తున్నారు. దాంతో సీనియర్ దర్శకుడు వివి వినాయిక్ కథని ఓకే చేసినట్లు సమాచారం.

 ఇంతకు ముందు స్టార్ డైరెక్టర్ వి.వి వినాయక్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కళ్యాణ్ ఓ సినిమాని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేసినప్పటికీ.. అప్పట్లో వినాయక్ కి పరిస్థితులు పెద్దగా కలిసి రాలేదు. హీరో, నిర్మాత ఒకే అయ్యాక కూడా కథ కుదరక..  చివరకు ఆ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది.

ఆ తరువాత తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘విక్ర‌మ్ వేద‌’ తెలుగులో వెంకటేష్ – నారా రోహిత్ కాంబినేషన్ లో వినాయక్ దర్శకత్వంలో రీమేక్ అవ్వబోతుందని రూమర్స్ వచ్చాయి.. చివరికి అవి కూడా కేవలం రూమర్సే అని తేలిపోయింది. ఏది ఏమైనా వినాయక్ నుండి  ఇంతకాలానికి మళ్లీ ఇంకో అప్ డేట్ రావటం ఆయన అభిమానులకు సంతోషమే.  మరో ప్రక్క రామ్ ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఏ సినిమా ముందు పట్టాలు ఎక్కుతుందో చూడాలి.