రామ్ మరో "పందెంకోడి"
అదే పద్దతిలో ఈ సినిమాలో ఓ డిఫరెంట్ మేనరిజంతో, పూర్తి రాయలసీమ స్లాంగ్ తో రామ్ అదరకొట్టబోతన్నారట. ఇదో బైలింగువల్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథ అని చెప్తున్నారు.
అప్పట్లో విశాల్ హీరోగా వచ్చిన పందెం కోడి సినిమా పెద్ద హిట్. అది తమిళ డబ్బింగ్ సినిమా అయినా ఇక్కడ తెగ ఆడేసింది. తెలుగులో రాయలసీమ నేపధ్యంలో కథ నడుస్తుంది. ఇప్పుడు రామ్ తో లింగు స్వామి చేయబోయేకథ కూడా అదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతోందని సమాచారం. పందెం కోడి పాత్ర తర్వాత కాలంలో పోలీస్ అయితే ఎలా ఉంటుందన్నట్లుగా కథనం సాగుతుందని చెప్పుకుంటున్నారు. ఆ పోలీస్ పాత్రని రామ్ చేస్తున్నారట. అయితే అదేమీ పందెంకోడి సీక్వెల్ గా చేయటం లేదట. పందెం కోడి సినిమా చూసిన వారికి అది అర్దమవుతుందిట. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా రామ్ రాయలసీమ భాషను మాట్లాడబోతున్నాడని.. ప్రచారం జరుగుతోంది.
రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలో తెలంగాణ భాష మాట్లాడి దుమ్ము రేపాడు. మాస్ గా ఇస్మార్ట్ శంకర్ అంటూ ఆ సినిమాలో రామ్ చేసిన రచ్చ తో యూత్ కి బాగా ఎక్కేసాడు. అదే పద్దతిలో ఈ సినిమాలో ఓ డిఫరెంట్ మేనరిజంతో, పూర్తి రాయలసీమ స్లాంగ్ తో రామ్ అదరకొట్టబోతన్నారట. ఇదో బైలింగువల్ మూవీ అని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు ,తమిళ్ భాషల్లో తెరకెక్కనుంది. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా కూడా మాస్ ఆడియన్స్ ను అలరించే అంశాలు ఎక్కువగా ఉన్న కథ అని చెప్తున్నారు.
అలాగే ఈ సినిమాలో విలన్ గా మాధవన్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ పాటికే ఈ సినిమా షూటింగు కొంతవరకూ పూర్తికావలసింది. కానీ కరోనా కారణంగా సెట్స్ పైకి వెళ్లలేదు. కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో, వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేయించిన లింగుస్వామి, ఇతర పనులపై దృష్టిపెట్టాడని అంటున్నారు. రామ్ -కృతి జంట తెరపై ఎలా అలరిస్తారో చూడాలి. సమంతతో యు టర్న్ సినిమా చేసిన నిర్మాతలు శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు నిర్మించబోతున్నారు.
లింగు స్వామీ ఇప్పటికే ఆవారా, సికిందర్ వంటి సినిమాలతో తెలుగులోనూ మంచి పేరు తెచ్చుకున్నారు. మరి రామ్‌తో అతడు ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. మరో ప్రక్క రామ్ ఇప్పటికే వెంకీ కుడుముల చెప్పిన ప్రేమకథను రిజెక్ట్ చేశారు. దాంతో రామ్ తన తదుపరి చిత్రంగా పక్కా మాస్ సబ్జెక్టుని ఎంచుకుంటారని తెలుస్తోంది.