షాకిస్తున్న రామ్ కొత్త సినిమా బడ్జెట్,వర్కవుట్ అవుతుందా?

హీరో గత చిత్రం కలెక్షన్స్ బట్టే సాధారణంగా సినిమా బడ్జెట్స్ లు నిర్ణయమవుతూంటాయి. అయితే ఒక్కోసారి బడ్జెట్ లెక్కలు వేసుకోకుండా,కేవలం స్క్రిప్టు డిమాండ్ మేరకు బారీ బడ్జెట్ లతో రంగంలోకి దిగుతూంటారు. దాంతో సినిమా బాగుందని టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ కాకపోతే కాస్ట్ ఫెయిల్యూర్ మూవీస్ గా మిగిలిపోతాయి. రామ్, లింగు స్వామి కాంబినేషన్ లో రూపొందే సినిమా బడ్జెట్ లెక్కల్లో ఈ టాపిక్ లు అన్ని వస్తున్నాయి. అసలు రామ్ మీద ఎంత పెట్టచ్చు, ఎంత వసూలు చేస్తుందనే లెక్కలు వేయకుండా ఉత్సాహంగా భారీగా పెట్టుబడి పెడుతున్నారని అంటున్నారు. 
 
Ram  Lingusamy Film On Huge Budget jsp

వివరాల్లోకి వెళితే..ఇస్మార్ట్ శంకర్ తో మంచి మాస్ హిట్ కొట్టిన హీరో రామ్ తన తదుపరి చిత్రాన్ని కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ చేసాడు. రెడ్ మూవీ ని ఓటిటి కి అడిగినా..అబ్బే  కుదరదు అంటూ సంక్రాంతి బరిలో దిగాడు. రెడ్ సినిమా వర్కవుట్ కాలేదు.  దాంతో రెడ్ తర్వాత రామ్ సైలెంట్ గా ఫోటో షూట్స్ అంటూ సోషల్ మీడియాలో యాక్టీవ్ అయ్యాడు. తన తదుపరి చిత్రం విషయంలో కొద్ది రోజులు సైలెంట్ గానే ఉన్నాడు. అయితే రామ్ తర్వాత ఏమిటి అని ఆలోచిస్తున్న అభిమానులకి రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో కమిట్ అవ్వబోతున్నాడనే న్యూస్ బయటికి వచ్చింది.

ఆ తర్వాత రామ్ – లింగుస్వామి సినిమాపై అఫీషియల్ ఎనౌన్సమెంట్  కూడా వచ్చేసింది. తెలుగు, తమిళ్ లో బై లింగ్యువల్ మూవీగా రామ్ నెక్స్ట్ ఉండబోతున్నట్లుగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. వాస్తవానికి గతంలో లింగుస్వామి..అల్లు అర్జున్ తో ఓ మూవీ చెయ్యాల్సి ఉంది. పూజా కార్యక్రమాలు చేసాక ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు అదే కథతో రామ్ లింగుస్వామితో చేస్తున్నాడంంటున్నారు.  అది ప్రక్కన పెడితే... ఈ సినిమాకు ఏకంగా 80 కోట్ల భారీ బడ్జెట్ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 హై క్వాలిటీ అండ్ భారీ స్టార్ కాస్ట్ తో ఈ సినిమా ఉండబోతుంది అంటున్నారు. రామ్ కెరీర్ లో చాలా సినిమాలు 20 నుండి 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందిన సినిమాలే…దాంతో సాధారణంగా నిర్మాతలు సేఫ్ జోన్ లోనే ఉంటారు. అలా ఎప్పుడూ భారీగా నిర్మాతలను రిస్కులో పెట్టని రామ్ మొదటి సారి ఇప్పుడు ఈ భారీ బడ్జెట్ మూవీతో సాహసం చేస్తున్నాడని అంటున్నారు. దానికి తోడు కొన్నాళ్లుగా లింగుస్వామికి అన్ని ప్లాపులే. 

రామ్ ఫ్లాఫ్ సినిమాలు నాన్ థియేట్రికల్ బిజినెస్ లు కూడా బాగా జరగడంతో కలిసొచ్చింది.  ఇప్పుడు అదే ధైర్యంతో ఇంత బడ్జెట్ తో రిస్క్ చేస్తున్నారు అంటున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోబోతున్న ఈ సినిమా తో రామ్ తన మార్కెట్ ని తమిళ్ లో ఏర్పరచుకునే దిసగా పావులు కదుపుతున్నాడంటున్నారు. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios