ఛక్లేట్ బాయ్ రామ్ ని సరికొత్గా చూపేందుకు దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా కష్టపెడుతున్నట్లు తెలుస్తోంది. ఫిట్ నెస్ లో ఇంతవరకు రామ్ పెద్దగా ప్రయోగాలు చేసింది లేదు. అప్పుడపుడు బాడీ చూపే ప్రయత్నం చూపించినా పెద్దగా వర్కౌట్ కాలేదు. అయితే ఈ సారి ఇస్మార్ట్ శంకర్ సినిమా కోసం పూరి కోరిక మేరకు బాడీ పెంచుతున్నాడు. 

సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా పూరి జగన్నాథ్ హీరోలను చూపించే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇక రామ్ ను పక్కా హైదరాబద్ లోకల్ బాయ్ గా చూపించనున్న పూరి ఫిట్ నెస్ లో కూడా కొన్ని మార్పులు చేస్తే బెటర్ అని చెప్పడంతో రామ్ తీరిక లేకుండా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్నాడట. 

ఇక త్వరలో సినిమాకు సంబందించిన రామ్ లుక్ ని రిలీజ్ చేయాలని పూరి జగన్నాథ్ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక సినిమాను మేలో విడుదల చెయ్యాలని అనుకుంటున్నట్లు ఇటీవల ఛార్మి వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే. రామ్ సరసన నిధి అగర్వాల్ - నాభ నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.