Asianet News TeluguAsianet News Telugu

RAM GOPALVARMA : ఉద్యమ గీతం పాడిన రామ్ గోపాల్ వర్మ.. కొండా సినిమా కోసం..

రామ్ గోపాల్ వర్మ మరోసారి తన గొంతు సవరించుకున్నారు. తను డైరెక్ట్ చేస్తున్న కొండా సినిమా కోసం ఓ ఉద్యమ గీతం పాడారు వర్మ 
 

Ram Gopalvarma Singing Filk Song
Author
Hyderabad, First Published Dec 14, 2021, 6:25 PM IST

ఎన్నో సంచలన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం తెలంగాణ రక్త చరిత్ర బ్యాక్ డ్రాప్ తో "కొండా" మూవీని తెరకెక్కిస్తున్నారు.రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కంపెనీ ప్రొడక్షన్ నిర్మాణం లో అదిత్ అరుణ్, ఇరా మోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొండా మూవీ, తెలంగాణ లో నిజ జీవిత సంఘటల ఆధారంగా  జరిగిన సాయుధ పోరాట కథ. 

 ఈ సినిమాలో ఓ ఉద్యమ గీతాన్ని వర్మ స్వయంగా పాడారు. వర్మకు పాటలు పాడటం కొత్తేమి కాదు. చాలా సినిమాల కోసం ఆయన గొంతు సవరించుకున్నారు ఇక ఈ సారి కూడా తన సినిమా కోసం మరోసారి గొంతు విప్పారు వర్మ, ఈ చిత్రం లో నల్గొండ గద్దర్.. నర్సన్నతో కలిసి... రామ్ గోపాల్ వర్మ  పాడిన 'భలే భలే' పాటను ఈరోజు (డిసెంబర్ 14 న) రిలీజ్ చేశారు.  


ఈ సినిమా వరంగల్ పరిసరప్రాంతాలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వరంగల్ లో జరిగిన నిజ జీవిత్ కథ ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు వర్మ. దీనికోసం ఆయన చాలా హోమ్ వర్క్ చేశారు. వరంగల్ లో పరిస్థితులు స్వంగా పరిశీలించారు. అక్కడ ప్రత్యేకంగా ఓ ప్రోగ్రాం కూడా నిర్వహించారు వర్మ. ఇప్పటికే ఎన్నో సంచల సినిమాలు తెరకెక్కించన స్టార్ డైరెక్టర్ కొండా సినిమాతో మరో సంచలనానికి తెరతీశారు. 


ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ "కొండా సినిమాని  వరంగల్ లో ఘనంగా ప్రారంభించామన్నారు. ఈసినిమా వరంగల్ లోనే కంప్లీట్ గా షూటింగ్ చేసుకోవాలని ప్లాన్ చేశామన్నారు వర్మ.  కానీ కొంతమంది కుతంత్రాల మూలాన వరంగల్ లో పూర్తి షెడ్యూల్ జరగలేదు. కొంత షూటింగ్ వేరే లొకేషన్స్ లో చేస్తున్నామంటూ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు వర్మ. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios