Asianet News TeluguAsianet News Telugu

మళ్లీ కెలికే పనిలో..? :వర్మ 'ఆర్జీవీ మిస్సింగ్‌' ట్రైలర్‌ వచ్చేసింది


 వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో పలువురు టాలీవుడ్‌ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. వర్మ క్రియేట్ చేసిన 'ఆర్జీవీ మిస్సింగ్' చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు.

Ram Gopal Varmas RGV Missing Official Trailer Released jsp
Author
Hyderabad, First Published Oct 25, 2020, 3:05 PM IST

 ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ ''ఆర్జీవీ మిస్సింగ్''. తనే( రాంగోపాల్ వర్మ) కిడ్నాప్ అయినట్లు రాసుకున్న కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రం ఫిక్షనల్ రియాలిటీ జోనర్లో రానుంది. సినిమా పబ్లిసిటీ విషయంలో డిఫరెంట్ గా ఆలోచించే వర్మ.. ఈ సినిమాకు కూడా అదే ఫాలో అవుతున్నాడు. రోజుకొక పోస్టర్ ని, తాజాగా ట్రైలర్ ని  రిలీజ్ చేస్తూ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు.  వర్మ నిన్న ప్రకటించిన విధంగానే దసరా రోజున చెప్పిన సమయం కంటే ఓ 20 నిమిషాలు ముందే ట్రైలర్‌ను విడుదల చేశారు.

 వర్మ మిస్సయిన ఘటనకు సంబంధించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఈ ట్రైలర్‌లో పలువురు టాలీవుడ్‌ స్టార్లు, పలువురు రాజకీయ ప్రముఖుల్ని పోలిన నటులు ఉన్నారు. వర్మ క్రియేట్ చేసిన 'ఆర్జీవీ మిస్సింగ్' చిత్రానికి అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా.. కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై చటర్జీ నిర్మిస్తున్నారు.

ట్రైలర్ లో రివీల్ అయిన కథ విషయానికొస్తే.. ఆర్జీవీ మిస్ అయ్యాడనే షాకింగ్ విషయాన్ని తెలుసుకున్న ఆర్జీవీ సిబ్బంది.. పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. అ​యితే పోలీసులు దీన్ని కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్‌గా భావించి లైట్ తీసుకుంటారు. కానీ అదే నిజమని నిర్ధారణ అవుతుంది. ఆ తర్వాత ముగ్గురిని నిందితులుగా భావించిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తారు. వారి విచారణలో షాకింగ్ విషయాలు తెలుసుకుంటారు. ఈ విధంగా కథ సాగుతుంది. ఈ ట్రైలర్‌ ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే వర్మ ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios