సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేమికుల కోసం ట్వీట్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా బ్రేక్ అప్ అయ్యే వారికి అదిరిపోయే సలహా ఇచ్చారు. వాలెంటైన్స్ డే గిఫ్ట్ పొందేందుకు రాత్రి వరకు వేచి ఉండండి అంటున్నాడు ఆర్జీవీ.  

టాలీవుడ్ లో ఎన్నో సంచలనాలు సృష్టించిన సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రేమికులకు పలు సూచనలు చేశారు. గత కొద్ది రోజులుగా ప్రతి విషయంలో పరోక్షంగానో.. ప్రత్యేక్షంగానో ఆర్జీవీ ఎంటరవుతూనే ఉన్నాడు. అటు ఇండస్ట్రీ పరంగానూ.. ఇటు సోషల్ గానూ చీమ చిటుక్కుమన్నా గమనిస్తున్నాడు. ఆయన శైలిలో స్పందిస్తున్నారు. అయితే తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా కూడా ఆర్జీవీ పలు సూచనలు, సలహాలు అందించారు. 

వాలెంటైన్స్ డే... ప్రేమికులకు ఇది ప్రత్యేకమైన రోజు. లవర్స్ ఒకరి ప్రేమను మరికరిపై చూపించే రోజు.. ఈ వారమంతా వారి ప్లానింగ్స్ వేరే లెవల్ లో ఉంటాయి. ఒకరిని మించి ఒకరు తమ ప్రేయసి, ప్రేమికుడిని ఇంప్రెస్ చేసేందుకు ఎంతో కష్టపడుతుంటారు. చివరికి వారి గుండెనిండా దాచుకున్న ప్రేమను సర్ ప్రైజ్ లు, గిఫ్ట్ లతో తెలియజేస్తుంటారు. ప్రతి ఒక్కరూ ఇష్టపడే రోజేదైనా ఉందంటే అది వాలెంటైన్స్ డేగా చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ ఆర్జీవీ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. ట్విట్టర్ వేదికన ప్రేమికులకు సూచనలు, సలహాలు, సందేశాలు కూడా అందించారు.

‘ప్రేమికుల రోజున నేను హ్యాపీ వాలెంటైన్స్ డే చెప్పను ఎందుకంటే ప్రేమికులను ఐక్యంగా ఉంచడంలో వాలెంటైన్ సరిగ్గా పనిచేయడం లేదు.. విడిదీయడమే దీని నిదర్శనం, విడిపోవాలని ఆలోచిస్తున్న ప్రేమికులందరికీ నా సలహా.. మీ వాలెంటైన్ గిఫ్ట్ పొందడానికి ఈ రాత్రి వరకు వేచి ఉండండి.. ప్రేమికులకు గొప్పవాన్ని ఉచితంగానే లభిస్తాయి.. కానీ అంతకు ముందు ఇవ్వాల్సిన బహుమతులు ఖరీదైనవిగా ఉంటాయి.. మొదటి చూపులో ప్రేమ మంచిగానే ఉంటుంది, కానీ రెండోసారి, మూడోసారి కూడా చూసినప్పుడు మొదటి చూపులోని మంచి కనిపించదు’ అంటూ ట్వీట్ చేశారు. 

View post on Instagram

ఇంకా.. ‘ప్రేమలో పడితే మెదడు పనిచేయడం మానేస్తుంది.. అందుకే చాలా మంది ప్రేమికులు మూగవారిగా మిగిలిపోతున్నారు... మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఉత్తమం... మీ కోసం వేరొకరిని నమ్మడంలో అర్థం లేదు... మీ కంటే ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని కలిసే వరకే ఒకరు మిమ్మల్ని ప్రేమిస్తారు... గుండె రక్తాన్ని మాత్రమే పంపింగ్ చేయాలి.. ప్రేమ లాంటి అనవసరమైన విషయాలలో తలదూర్చకూడదు... నిజమైన ప్రేమ పిల్లలు, కుక్కల వద్దే లభిస్తుంది, ఎందుకంటే అవి ఎప్పుడూ భాదపెట్టవు.. మెదడుతో ప్రేమించడం ప్రారంభించండి.. ఎందుకంటే హృదయంతో ప్రేమించడం అనేది మీపైనే దాడికి సిద్ధమవడం..’ అంటూ ప్రేమికులకు ఆర్జీవీ లవ్ వార్న్ కోట్స్ అందించారు. 

మరోవైపు ఆర్జీవీ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘కొండా’. స్టార్ పొలిటిషన్స్ ‘కొండా సురేఖ, కొండా మురళీ’ జీవితంలో జరిగిన కొన్ని సన్నివేశాల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కాగా.. ఈ రోజు వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ‘అందమంటే’ రోమాంటిక్ సాంగ్ రిలీజ్ కానుంది. ఇది వరకే రిలీజైన్ కొండా టైటిల్ సాంగ్, టీజర్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.