సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల ప్రమోషన్ కోసం ఒక్కోసారి వేరే సినిమాలతో పోలుస్తూ ప్రచారం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. తన సినిమా ప్రచారాల కోసం పక్క వాళ్లను వాడుకోవడానికి వర్మ అసలు మొహమాట పడడు. తన కొత్త సినిమా 'భైరవ గీత' విషయంలో కూడా వర్మ ఇదే ఫాలో అవుతున్నాడు.
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన సినిమాల ప్రమోషన్ కోసం ఒక్కోసారి వేరే సినిమాలతో పోలుస్తూ ప్రచారం తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. తన సినిమా ప్రచారాల కోసం పక్క వాళ్లను వాడుకోవడానికి వర్మ అసలు మొహమాట పడడు.
తన కొత్త సినిమా 'భైరవ గీత' విషయంలో కూడా వర్మ ఇదే ఫాలో అవుతున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ ని తన సినిమా ప్రమోషన్ కోసం వాడేస్తున్నాడు. 'భైరవ గీత' సినిమాని వర్మ నిర్మిస్తూ తన శిష్యుడు సిద్ధార్థని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమా చూసిన వాళ్లు మాత్రం ఇది వర్మ సినిమా అనే అంటున్నారు.
తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించిన ఈ సినిమా '2.0' తో పాటు నవంబర్ 30న విడుదల కానుంది. శంకర్ నిర్మించిన భారీ చిత్రం '2.0'కి 'భైరవగీత' పోటీ అంటూ వర్మ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కొన్ని మీమ్స్ సిద్ధం చేసి మరీ ప్రచారం చేస్తున్నాడు.
శంకర్, సిద్ధార్థ ఫోటోలని పక్కపక్కన పెట్టి శంకర్.. సిద్ధార్థకి దండం పెట్టినట్లుగా ఓ ఫోటో పెట్టి శంకర్.. సిద్ధార్థని ఎగతాళి చేస్తున్నట్లున్నారని అన్నారు. మరొక ట్వీట్ లో 'రోబో 2.0కి పోటీగా భైరవగీత విడుదల చేస్తున్నాడని చిన్న దర్శకుడు సిద్ధార్థని చూసి పెద్ద దర్శకుడు శంకర్ నవ్వుతున్నారు' అంటూ పేర్కొన్నారు. ఈ ట్వీట్లు చూస్తుంటే 2.0 ఇమేజ్ ని వర్మ తన సినిమా కోసం వాడుకోవాలని చూస్తున్నట్లు అనిపిస్తోంది.
