నిజ జీవితాల ఆధారంగా తెరకెక్కే బయోపిక్ లపై జనాలకు ఆసక్తి ఉండడం సహజం. ఇప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రతో రెండు సినిమాలు ఒకేసారి వస్తుండడంతో ఆసక్తి మరింత పెరిగిపోతోంది. ఓ పక్క క్రిష్ రూపొందిస్తోన్న 'మహానాయకుడు' మరో పక్క వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్'. కొద్దిరోజుల గ్యాప్ లోనే ఈ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

'లక్ష్మీస్ ఎన్టీఆర్' ట్రైలర్ విడుదలైనప్పటి నుండి సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఇదే నిజమైన బయోపిక్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. 'మహానాయకుడు' ట్రైలర్ కూడా ఆడియన్స్ ముందుకు వచ్చింది కానీ అంత ఇంపాక్ట్ చూపలేకపోయింది.

తాజాగా వర్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోల్ నిర్వహించాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్, మహానాయకుడు చిత్రాల్లో ఏ సినిమా నిజాయితీగా, యధార్ధ సంఘటనలకు దగ్గర ఉంటుందని వర్మ పోల్ కండక్ట్ చేశాడు.

ఈ పోల్ కి 41,734 ఓట్లు వచ్చాయి. అందులో ఎనభై శాతం ఓట్లు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రానికే వచ్చాయి. దీంతో వర్మ సత్యమే గెలిచింది.. జై ఎన్టీఆర్ అంటూ పోస్ట్ పెట్టారు.