వోడ్కా కిక్ లో అర్ధరాత్రి సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ వర్మ (Ram gopal varma)ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఈసారి ఏకంగా పొద్దున్నే పవన్ ని తగులుకున్నాడు. ఇవి వోడ్కా మత్తులో చేస్తున్న ట్వీట్స్ కాదు, కాఫీ టైం లో పూర్తి స్పృహతో రాస్తున్న నిజాలు అంటూ... వరుస కామెంట్స్ మొదలుపెట్టాడు. 



వారానికో పదిరోజులకో పవన్ కళ్యాణ్ (Bheemla Nayak)ని, ఆయన ఫ్యాన్స్ ని గెలక్కపోతే రామ్ గోపాల్ వర్మకు నిద్రపట్టదు. ఆయనకు అదో సరదా. వర్మ ట్రోల్ చేసినంతగా పవన్ ను మరొకరు చేయలేదంటే అతిశయోక్తి కాదు. పవన్ యాంటీ ఫ్యాన్స్, మీమర్స్, ట్రోలర్స్ కూడా ఈ విషయంలో వర్మ తర్వాతే. ఈ మధ్య అల్లు అర్జున్ ని ఆకాశానికి ఎత్తుతున్న వర్మ, ఆయనతో పోల్చుతూ పవన్ కళ్యాణ్ పై చులక భావనతో ట్వీట్స్ చేస్తున్నారు.

సాధారణంగా వోడ్కా కిక్ లో అర్ధరాత్రి సెలెబ్రిటీలను టార్గెట్ చేస్తూ వర్మ (Ram gopal varma)ట్వీట్స్ చేస్తూ ఉంటారు. ఈసారి ఏకంగా పొద్దున్నే పవన్ ని తగులుకున్నాడు. ఇవి వోడ్కా మత్తులో చేస్తున్న ట్వీట్స్ కాదు, కాఫీ టైం లో పూర్తి స్పృహతో రాస్తున్న నిజాలు అంటూ... వరుస కామెంట్స్ మొదలుపెట్టాడు. ఇప్పుడు వర్మ బాధేంటంటే, భీమ్లా నాయక్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలట. భీమ్లా నాయక్ పాన్ ఇండియా స్థాయిలో ఖచ్చితంగా వర్కవుట్ అవుతుందని ఆయన ప్రగాఢ నమ్మకం. 

మరి వర్మ ఏం చెప్పినా దానికి తనదైన థియరీ ఉంటుంది. భీమ్లా నాయక్ పాన్ ఇండియా విడుదల విషయంలో కూడా వర్మ కొన్ని లాజిక్స్ తో వచ్చాడు. ఆంధ్రప్రదేశ్ లో జరిగే రెడ్ శాండల్ స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన పుష్ప, తెలుగు వీరుల జీవిత చరిత్రగా తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ (RRR movie)పాన్ ఇండియా చిత్రాలు అయినప్పుడు... భీమ్లా నాయక్ పాన్ ఇండియా మూవీ ఎందుకు కాదంటున్నారు. 


అలాగే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)పై ప్రేమతో వర్మ వ్యక్తపరుస్తున్న మరో బాధ ఏంటంటే... పవన్ కళ్యాణ్ కంటే వెనుక వచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్స్ అయిపోతుంటే, ఆయన మాత్రం ఇంకా తెలుగును పట్టుకొని వేలాడుతున్నాడట. పవన్ ని పాన్ ఇండియా స్టార్ గా చూడడమే తనకు కావాలంటున్నారు. 

ఇక సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ హిందీలో వర్కవుట్ కాదు, వద్దని చెప్పినా వినకుండా విడుదల చేశారు. దాని ఫలితం చూశారు. ఈ సారి భీమ్లా నాయక్ పాన్ ఇండియా మూవీగా విడుదల చేయండి, పెద్ద హిట్ అవుతుంది. నా మాట వినండి.. అంటూ వర్మ తన ట్వీట్స్ ద్వారా అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. భీమ్లా నాయక్ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేసి సబ్కా బాప్ అని నిరూపించండి అంటున్నారు. పుష్ప మూవీనే అంత వసూలు చేస్తే భీమ్లా నాయక్ ఎంత వసూలు చేయాలి?పాన్ ఇండియా సినిమా లాగా రిలీజ్ చెయ్యకపోతే మీ ఫ్యాన్స్ అయిన మేమంతా బన్నీ ఫ్యాన్స్ కి ఆన్సర్ చెయ్యలేము అంటూ పవన్ ఫ్యాన్స్ తరపు నుండి వాళ్లలో ఒకడిగా అందరు ఫ్యాన్స్ మనోగతాన్ని తన అభిప్రాయంగా తెలియజేశారు. 

Scroll to load tweet…

మొత్తంగా వర్మ ట్వీట్స్ గమనిస్తే పవన్ తర్వాత హీరోలుగా ఎంట్రీ స్టార్ డమ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ పాన్ ఇండియా హీరోలుగా నిరూపించుకున్నారు. వారిలో కొందరు పాన్ ఇండియా హీరోగా ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నారు. కానీ పవన్ మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు వేయలేదు. కాబట్టి విడుదలకు సిద్ధంగా ఉన్న భీమ్లా నాయక్ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలని కోరుకుంటున్నారు. అయితే పవన్ స్టామినాను గుర్తు చేస్తూనే వర్మ వెనకబడిపోయావంటూ పరోక్షంగా సెటైర్స్ వేస్తున్నారు. వర్మ వరుస ట్వీట్స్ వైరల్ గా మారగా... ఇక కామెంట్స్ హోరెత్తుతున్నాయి. 

Scroll to load tweet…